ముందుంది మహా మాంద్యం…వరల్డ్ ఎకానమీ జీడీపీ 3 శాతం తగ్గుతుంది- ఐఎంఎఫ్

ముందుంది మహా మాంద్యం…వరల్డ్ ఎకానమీ జీడీపీ 3 శాతం తగ్గుతుంది- ఐఎంఎఫ్
  • 9 ట్రిలియన్ డాలర్ల నష్టం తప్పదంటూ అంచనాలు
  • 100 ఏళ్లలో ఎన్నూడూ లేనంత వరస్ట్ సిచ్యూవేషన్

వాషింగ్టన్ : కరోనా ఎఫెక్ట్ వరల్డ్ ఎకానమీని కోలుకోలేని దెబ్బ తీస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తెలిపింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా సగం ప్రపంచం లాక్ డౌన్ లో ఉంది. మొత్తం ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. దీని ఎఫెక్ట్ 2020 లో ఘోరంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. వరల్డ్ ఎకానమీ జీడీపీ 3 శాతం పడిపోతుందని తెలిపింది. ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపినాథ్ తాజా అంచనాలను మంగళవారం విడుదల చేశారు. కరోనా ఎఫెక్ట్ తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటే 2021 లో వరల్డ్ ఎకానమీ 5.8 శాతం వృద్ధి సాధిస్తుందన్నారు. ఐతే ఇది పరిస్థితులను బట్టి మారిపోవచ్చన్నారు. కచ్చితత్వంతో కూడిన అంచనాలకు కావని కరోనా ఎఫెక్ట్ చాలా రోజులు కొనసాగితే సిచ్యూవేషన్ వరస్ట్ గా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా గత వందేళ్లలో ఎన్నడూ చూడని మహా ఆర్థిక మాంద్యాన్ని ప్రపంచ చూడబోతుందన్నారు. 1929 లో ఏర్పడి గ్రేట్ డిప్రెషన్ తర్వాత మళ్లీ ఇప్పుడే అలాంటి పరిస్థితులున్నాయన్నారు. దాదాపు 9 ట్రిలియన్ డాలర్ల వరల్డ్ ఎకానమీ నష్టం పోతుందని తెలిపారు. కరోనాతో ఏర్పడే మాంద్యం…ఏళ్లపాటు మానవాళిని పట్టి పీడించనున్న మరో మహ్మమరి అని గీతా గోపినాథ్ తెలిపారు. రికవరీ మొదలైనా సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయన్నది చెప్పలేమన్నారు.
ది గ్రేట్ లాక్ డౌన్
వరల్డ్ వైడ్ గా ఇప్పుడున్న పరిస్థితిని ‘ది గ్రేట్ లాక్ డౌన్’ అని ఐఎంఎఫ్ పేర్కొంది. ” గ్రేట్ డిప్రెషన్ నాటి ఆధ్వాన్న పరిస్థితులను ఈ ఏడాది వరల్డ్ ఎకానమీ చూడనుంది. 2008 లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం కన్నా కూడా దీని ప్రభావం ఎక్కుగా ఉంటుంది ” అని ఐఎంఎఫ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో కరోనా ఎఫెక్ట్ మరింత పీక్ కి చేరవచ్చని దీంతో చాలా వ్యాపారాలు మూతబడతాయని అంచనా వేసింది. ఫైనాన్షియల్ క్రైసెస్ తో చాలా మంది దివాళాల తీయటం నిరుద్యోగ సమస్యలు తప్పవని హెచ్చరించింది.