AI తో పనిచేసే మొట్టమొదటి హాస్పిటల్!..ఇక్కడ రోబోలే డాకర్లు..95 శాతం ఆక్యురసీతో ట్రీట్మెంట్

AI తో పనిచేసే మొట్టమొదటి హాస్పిటల్!..ఇక్కడ రోబోలే డాకర్లు..95 శాతం ఆక్యురసీతో ట్రీట్మెంట్

వైద్య చరిత్రలో పెను సంచలనం..ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేథస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో రన్ అయ్యే హాస్పిటల్ మొదలైంది. నమ్మలేకపోతున్నారా..ఇది నిజం..గతేడాది వైరల్ అయిన స్టాన్‌ఫోర్డ్‌లోని AI పట్టణం మాదిరిగానే చైనా పరిశోధకులు AI ఆసుపత్రి పట్టణాన్ని అభివృద్ధి చేశారు.

 ఏజెంట్ హాస్పిటల్ అని పేరు పెట్టారు. ఈ AI ఆసుపత్రిని సింఘువా విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ AI హాస్పిటల్ లో 14 మంది డాక్టర్లు, నలుగురు వర్చువల్ నర్సులు పనిచేస్తున్నారట. 

ఆరోగ్య సంరక్షణకు మొదలుపెట్టిన ఈ వినూత్న విధానం సామర్థ్యాన్ని పరిశోధకులు హైలైట్ చేశారు. AI హాస్పిటల్ పట్టణంలో AI వైద్యులు చికిత్స చేసే వర్చువల్ రోగులు ఉన్నారు.ఇవి స్వయంగా వారి వైద్య నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి ,మెరుగుపరచడానికి రూపొందించారు. వర్చువల్ విధానంలో వైద్యులు, నర్సులు,రోగులు సెల్ఫ్ గా పని చేసే విధంగా  పెద్ద భాషా నమూనా (LLM)-శక్తితో కూడిన మేధో ఏజెంట్లచే రన్ చేస్తారు. 

ALSO READ | Time bond: సంతోషం అంటే ఏమిటి.. ఎలా పొందాలి...

ఇది చాట్ జీపీటీ (Chat GPT) 3.5 టెక్నాలజీతో ఉపయోగించి పేషెంటు , డాక్టర్ పాత్ర పోషిస్తున్నాయట. నానో డాక్టర్లు సాధారణంగా చూపించే ఆక్యురసీ 80 నుంచి 82 శాతం మాత్రమే కాగా.. ఈ AI డాక్టర్స్ 93 శాతం ఆక్యురెసీతో నిర్ధారణ చేస్తున్నారట. 

అంతేకాదు అతిస్వల్పకాలంలో పదివేల మందికి ట్రీట్మెంట్ చేయగల సత్తా కలిగి ఉన్నారట. మానవ డాక్టర్లు ఈ పనిచేయాలంటే రెండేళ్లు పడుతుందని చెపుతున్నారు. వేగం, ఖచ్చితత్వం, AI వైద్యానికి వచ్చేసింది..కానీ మానవ అనుభూతిని మాత్రం ఇంకా చేరుకోవాల్సి ఉందని డాక్టర్లు అంటున్నారు.