ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్(అణు గడియారం)ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ గడియారం ద్వారా అత్యంత కచ్చితత్వంతో సమయాన్ని గుర్తించవచ్చు. పరమాణువు కేంద్రకం నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఈ గడియారం పనిచేస్తుంది. అధికారికంగా అంతర్జాతీయ సమయాన్ని చెప్పే ప్రస్తుతం అటామిక్ గడియారాల కంటే ఈ న్యూక్లియర్ గడియారం మరింత కచ్చితత్వంతో సమయాన్ని చెబుతుంది.
భవిష్యత్తులో అటామిక్ గడియారాలను న్యూక్లియర్గడియారాలు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీపీఎస్ వ్యవస్థలు మరింత కచ్చితత్వంతో పనిచేయడానికి, ఇంటర్నెట్ వేగం పెరగడానికి డిజిటల్ సమాచార వ్యవస్థల భద్రతకు, శాస్త్ర పరిశోధనలకు ఈ గడియారం కీలకంగా మారనున్నది .