లక్ష కోట్ల ఆస్తి  కరిగిపాయె:  బిలియనీర్‌‌ ల్యారీకి గట్టి  షాక్‌‌

లక్ష కోట్ల ఆస్తి  కరిగిపాయె:  బిలియనీర్‌‌ ల్యారీకి గట్టి  షాక్‌‌
  • లక్ష కోట్ల ఆస్తి కరిగిపాయె..మిగిలింది రూ.2,200 కోట్లే
  • బిలియనీర్‌‌ ల్యారీ  చెన్‌‌కు చైనీస్ గవర్నమెంట్ షాక్‌‌
  • ఆన్‌‌లైన్ ట్యూటరింగ్  కంపెనీలపై రిస్ట్రిక్షన్లు...

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: ఆరు నెలల క్రితం టాప్ బిలియనీరే కాని,  ప్రస్తుతం ఆ స్టేటస్ పొందే పొజిషన్‌‌‌‌లో కూడా ఆయన  లేరు. ఆన్‌‌‌‌లైన్ ట్యూటరింగ్ (పాఠాలు చెప్పడం)  కంపెనీని పెట్టి అత్యంత ధనవంతుడిగా మారిన చైనీస్ బిలియనీర్‌‌‌‌‌‌‌‌ ల్యారీ చెన్‌‌‌‌కు అక్కడి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.11 లక్షల కోట్లు) ఉన్న ఆయన సంపద, సోమవారం నాటికి 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,220 కోట్ల) దిగువకు పడిపోయింది. చైనీస్ స్కూల్‌‌‌‌ సబ్జెక్ట్‌‌‌‌లను చెప్పే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ట్యూటరింగ్ కంపెనీలు ప్రాఫిట్స్ కోసం బిజినెస్ చేయకూడదని చైనీస్ గవర్నమెంట్‌‌‌‌ తాజాగా ఓ పాలసీని తీసుకొచ్చింది. అంతేకాకుండా విదేశీ మార్కెట్‌‌‌‌లో లిస్ట్‌‌‌‌ అవ్వకుండా రిస్ట్రిక్షన్లు పెట్టింది. ఇప్పటికే ఉన్న ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ట్యూటరింగ్ కంపెనీలు తమ బిజినెస్‌‌‌‌ను నాన్‌‌‌‌ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌‌‌‌గా మార్చాల్సి ఉంటుంది. కొత్తగా రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ అవుదామన్న కంపెనీలకు లైసెన్స్‌‌‌‌లు ఇవ్వకూడదని చైనీస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ట్యూటరింగ్ కంపెనీలపై టార్గెట్‌‌‌‌..
ఒకప్పుడు టీచర్‌‌‌‌గా పనిచేసిన ల్యారీ చెన్‌‌‌‌ 2014 లో  ఆన్‌‌‌‌లైన్ ట్యూటరింగ్ కంపెనీ గౌటు (పాత పేరు జీఎస్‌‌‌‌ఎక్స్‌‌‌‌)  ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ షేరు గత ఆరేళ్లలో 13 రెట్లకు పైగా పెరిగింది. కానీ, ఈ మధ్య చైనీస్ గవర్నమెంట్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్ ట్యూటరింగ్ కంపెనీలపై స్క్రూటినీ పెంచడంతో ఆయన కంపెనీ షేర్లు నష్టపోతున్నాయి. ముఖ్యంగా చైనీస్ అకాడమిక్ సబ్జెక్ట్‌‌‌‌లను టీచ్ చేస్తున్న ట్యూటరింగ్ కంపెనీలను అక్కడి ప్రభుత్వం టార్గెట్ చేసింది. చైనాలో జనాభా తగ్గుతుండడంతో కొత్తగా పెళ్లయిన వాళ్లు ముగ్గురు పిల్లలను కనాలని చైనీస్‌‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ, చైనాలో ఎడ్యుకేషన్ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ముగ్గురు పిల్లలను కనడంపై చైనా జనాభా వెనకడుగేస్తోందని మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రభుత్వం కూడా పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చులను తగ్గించేందుకు ఇలా ట్యూటరింగ్ కంపెనీలను టార్గెట్‌‌‌‌ చేసిందని, ఇవి ప్రాఫిట్స్‌‌‌‌ కోసం నడవకుండా పాలసీ తెచ్చిందని ఎనలిస్టులు అంటున్నారు.  ఇప్పటికే ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కంపెనీలు రెగ్యులేటరీ రివ్యూలకు వెళ్లాల్సి ఉంటుందని, లైసెన్స్‌‌‌‌కు మరోసారి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. రూల్స్ ఫాలో కాకపోతే లైసెన్స్‌‌లు రద్దు చేస్తారని పేర్కొన్నారు. పాలసీని తెచ్చిన సందర్భంగా ‘ట్యూటరింగ్‌‌‌‌ ఇండస్ట్రీని క్యాపిటలిస్టులు హైజాక్ చేశారు’ అని చైనీస్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వ్యాఖ్యానించడం గమనించాలి.
ఒకే రోజు 66 శాతం డౌన్‌‌..
చైనీస్ గవర్నమెంట్‌‌ ఇచ్చిన షాక్‌‌తో ల్యారీ చెన్‌‌ కంపెనీ గోటూ టెక్‌‌ఎడు షేర్లు భారీగా నష్టపోతున్నాయి.  న్యూయార్క్ ఎక్స్చేంజిలో లిస్టయిన కంపెనీ షేర్లు ఒకే రోజు 66 శాతం (శుక్రవారం) నష్టపోయాయి.   ఈ ఏడాది జనవరి 27 న 149 డాలర్ల వద్ద ఏడాది గరిష్టాన్ని టచ్ చేసిన కంపెనీ షేర్లు, శుక్రవారం నాటికి 3.52 డాలర్లకు పడిపోయాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిల్లో లిస్ట్‌ అయిన మరో రెండు  చైనీస్‌ ట్యూటరింగ్ కంపెనీలు కూడా భారీగా నష్టపోతున్నాయి. దీంతో ఈ కంపెనీల ఓనర్ల సంపద కరుగుతోంది.  టాల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీఈఓ జాంగ్‌‌ బాంక్షిన్‌‌ సంపద 2.5 బిలియన్‌‌ డాలర్లు తగ్గి 1.4 బిలియన్ డాలర్లకు,  న్యూ ఓరియంటల్‌‌ ఎడ్యుకేషన్ చైర్మన్ యూ మిన్‌‌హో సంపద 579 మిలియన్ డాలర్లకు పడిపోయింది.