నన్ను బెదిరించిన జర్నలిస్టు ఎవరో చెప్పను

నన్ను బెదిరించిన  జర్నలిస్టు ఎవరో చెప్పను

ప్రస్తుతం క్రికెట్ ల్ కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన క్రికెటర్ టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా. శ్రీలంకతో టెస్టు సిరీస్ కు అతడిని ఎంపిక చేయకపోవడంతో మీడియా ముందుకు వచ్చిన అతను ఏకంగా టీమిండియా మేనేజ్ మెంట్ పై, గంగూలీపై సంచలన ఆరోపణలు చేసి హాట్ టాపిక్ గా మారిండు. అలాగే ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్ట్ తనను బెదిరించాడని వాట్సప్ చాట్ ను  పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. చాలా మంది క్రికెటర్లు సాహాకు మద్దతుగా నిలిచారు. అయితే తనను బెదిరించిన జర్నలిస్ట్ ఎవరో బీసీసీఐ అడిగినా  చెప్పబోనని సాహా  క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు బీసీసీఐ తనను అడగలేదని..ఒక వేళ అడిగినా  జర్నలిస్టు గురించి చెప్పి అతడి కెరీర్ నాశనం చేయాలనే ఉద్దేశం తనకు లేదన్నాడు. ఇతరుల్ని ఇబ్బందిక పెట్టబోనని..తన తల్లిదండ్రులు తనను అలా పెచలేదన్నాడు. మీడియాలో కూడా అలాంటి వ్యక్తి ఉన్నారని తెలియజేయడానికే తాను ట్వీట్ చేశానన్నాడు సాహా.

ఇవి కూడా చదవండి:

తొమ్మిదేండ్ల యోగా గురువు

ఇంటర్  స్టూడెంట్ మిస్సింగ్