టిబెట్‌కు జిన్ పింగ్.. సీక్రెట్‌గా చైనా అధ్యక్షుడి విజిట్

టిబెట్‌కు జిన్ పింగ్.. సీక్రెట్‌గా చైనా అధ్యక్షుడి విజిట్

లాసా: టిబెట్ ప్రజల మనసులను గెలుచుకోవాలని చైనా భావిస్తోంది. అక్కడి ప్రజల్లో చైనాపై ఉన్న అసమ్మతి, అసంతృప్తిని తగ్గించి తన గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ టిబెట్ లో పర్యటించడం ఆసక్తిగా మారింది. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ప్రెసిడెంట్ గా ఉన్న జిన్ పింగ్.. టిబెట్ సందర్శనకు రావడం ఇదే తొలిసారి. 1990లో జియాంగ్‌ జెమిన్‌ తర్వాత ఒక చైనా అధ్యక్షుడు ఈ ప్రాంతానికి రావడం ఇదే మొదటిసారి. జిన్‌పింగ్‌ పర్యటనను మీడియా అత్యంత రహస్యంగా ఉంచింది. ఆయన పర్యటన బుధవారం మొదలుకాగా.. ఆ కార్యక్రమాలను శుక్రవారం ప్రసారం చేయడం గమనార్హం.