రియల్ డాగ్స్‌ని మరపించే సైబర్ రోబో డాగ్‌లు ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టి చాలా కాలమే అవుతోంది. అయితే మార్కెట్‌లో వీటి ధర మాత్రం అందరికీ అందుబాటులో లేదు. ప్రస్తుతం బోస్టన్ డైనమిక్ సైబర్ రోబో డాగ్స్ 74,500 డాలర్లు పలుకుతున్నాయి. వీటికంటే తక్కువ ధరకు లభించే సైబర్ రోబో డాగ్స్‌ను చైనా సంస్థ షియామీ రీసెంట్‌గా లాంచ్ చేసింది. వీటి ధర కేవలం 1,540 డాలర్లు మాత్రమే. ధర మాత్రమే కాదు వీటి బరువు కూడా తేలికే. చూడటానికి బోస్టన్ డాగ్ కంటే చిన్నగా 15.7 ఇంచెస్, 31 ఎల్‌బీఎస్‌తో వీటిని తయారు చేసారు. అయితే ఇవి బోస్టన్ డైనమిక్ డాగ్స్‌కి ఏ మాత్రం తీసిపోవు. వీటిని కూడా హైలీ డెసిబుల్ సౌండ్ సిస్టమ్, జీపీఎస్ మాడ్యూల్స్, అల్ట్రాసోనిక్ ట్రాన్‌స్యూడర్స్, టచ్ సెన్సర్స్, మల్టిఫుల్ కెమెరాలతో రూపొందించారు. విజన్ సెన్సార్స్‌తో పాటు వస్తువులను సులభంగా ట్రాక్ చేయడం, లోకల్ మ్యాపింగ్‌లాంటివన్నీ దీనిలో ఉంటాయి. ఇందులో శక్తివంతమైన సర్వో మోటార్ ఉండటం వల్ల ఇది 7.2 ఏపీహెచ్ వేగంతో పరుగెత్తగలదు. ఫేస్ రికగ్నైజ్ ట్రాకింగ్ వల్ల ఇవి తమ యజమానులను గుర్తిస్తాయి. రిమోట్ లేదా వాయిస్ ట్రాకర్‌తో వీటిని ఈజీగా కంట్రోల్ చేయచ్చు. ఇప్పటి వరకూ అతి కొద్ది మంది మాత్రమే వినియోగిస్తున్న వీటిని అక్కడి ఇంజనీర్లు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా డిజైన్ చేశారు. త్వరలోనే ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి. కానీ గతేడాది చైనాలోని యూనిట్రీ టెక్ సంస్థ 2,700 డాలర్ల ధరతో ‘గో 1’ అనే సైబర్ డాగ్ రోబోని తయారు చేసింది. కానీ వీటికంటే తక్కువ ధరతో ఉన్న ఈ షియామీ సైబర్ డాగ్స్‌కి మార్కెట్‌లో డిమాండ్ పెరగొచ్చేమో.
