యెడ్యూరప్పతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు!

యెడ్యూరప్పతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు!

కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. బి.ఎస్‌.యడ్యూరప్పను సీఎం పదవి వరించనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కోసం ఇవాళ(బుధవారం) బీజేపీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. రాబోయే బీజేపీ ప్రభుత్వంలో సీఎంగా యడ్యూరప్పతోపాటు.. మరో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా నియమించే అంశాలపై చర్చించారు. ఈ ప్రతిపాదన ప్రతిని గవర్నర్‌ వజుభాయ్‌ వాలాకు యడ్యూరప్ప అందించారు. తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు యడ్యూరప్ప ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అధిష్టానం ఆదేశిస్తే ఇవాళే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో సర్కారు ఏర్పాటుకు ఆలస్యం చేయకూడదని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.