
బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప సంచలన ప్రకటన చేశారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనని స్పష్టం చేశారు. తన కొడుకు బీవై విజయేంద్ర కోసం తన నియోజకవర్గ సీటును వదులుకుంటున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో శివమొగ్గ జిల్లాలోని శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కొడుకు పోటీ చేస్తాడని ఈ సందర్భంగా యడ్యూరప్ప వెల్లడించారు. విజయేంద్రను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. దక్షిణాదిలో అధికారంలో ఉన్న పార్టీలో తనను పక్కన పెట్టారనే వాదనలను ఖండించిన రోజు తర్వాత.. యడ్యూరప్ప ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అంతే కాకుండా కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వబోమని, కేవలం బీజేపీ అభ్యర్థే సీఎం అవుతారని తెలిపారు.