దోపిడీ దొంగలను తరిమికొట్టాలె : యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

దోపిడీ దొంగలను తరిమికొట్టాలె :  యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

హన్వాడ, వెలుగు : పాలమూరును దోచుకుంటున్న దోపిడీ దొంగలను తరిమికొట్టాలని మహబూబ్​నగర్ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం  మండలంలోని పెద్దదర్పల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్​ ఇండ్లు, పింఛన్లు, దళితబంధు, బీసీ బంధు లాంటి స్కీములను పాలమూరులో పక్కదోవ పట్టిస్తున్నారన్నారు.  ఎవరు ఎదురు తిరిగినా, ప్రశ్నించినా వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి యువతను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను ప్రజలకు అందిస్తామని,  సేవ చేసుకునే అవకాశం   ఇవ్వాలని  ఓటర్లను కోరారు. కార్యక్రమంలో లీడర్లు ఎన్​పీ వెంకటేశ్​, ఆనంద్ గౌడ్ , సురేందర్ రెడ్డి,  పార్టీ మండల అధ్యక్షుడు టంకర కృష్ణయ్య యాదవ్, శివ, శేఖర్​, కేశవులు, దేవేందర్​, రామస్వామిగౌడ్​, యాదయ్య గౌడ్​ తదితరులు పాల్గొన్నారు. కాగా, బండమీదపల్లి 13వ వార్డు కౌన్సిలర్ లింగమయ్య యాదవ్, బీఆర్ఎస్ యూత్ లీడర్  మనోజ్ కుమార్, వంద మంది యెన్నం సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.

మతిభ్రమించి మాట్లాడుతున్నారు

పాలమూరు, వెలుగు: 'పాలమూరు ప్రజలు మంత్రిని ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆయనకు తెలిసింది. దీంతో మతిభ్రమించి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. బ్లాక్​ మెయిల్​ రాజకీయాలు చేస్తోంది ఎవరో, ప్రజలకు తెలుసు' అని యెన్నం శ్రీనివాస్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ నినాదం ఎత్తుకొని రాజకీయాలు చేస్తున్న మంత్రి  బీసీ లీడర్లపై పెట్టిన కేసులను బీసీ సమాజం మరిచిపోదన్నారు.

 ఇతర పార్టీలలో పనిచేస్తున్న వారిని  బెదిరించడం ఎక్కడి సంస్కృతి అని ప్రశ్నించారు. మహబూబ్​నగర్ ప్రజలు సరైన నిర్ణయం తీసుకొనే సమయం ఆసన్నమైందన్నారు. ఈ నెల 30న కాంగ్రెస్​కు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన  కోరారు. సమావేశంలో   వినోద్ కుమార్, ఎన్పీ వెంకటేశ్​,  సిరాజ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.