యంగ్ గా కనపడాలంటే..

యంగ్ గా కనపడాలంటే..

యంగ్ గా కనపడాలని అందరికీ ఉంటుంది. కానీ వయసు 40 ఏళ్లు దాటగానే చాలామంది పెద్దవాళ్లు అయిపోయినట్టు కనిపిస్తారు.  అలా కాకుండా నలభై యాభైల్లో కూడా యంగ్ గా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.వయసు పెరిగేకొద్ది రకరకాల టెన్షన్స్ వల్ల శరీరంలో ఆండినలైన్‌ , కోర్టిజాల్‌ వంటి హార్మోన్లు విడుదలవ్వడం ఎక్కువవుతుంది. దాంతో గుండెవేగం పెరిగి హైపర్‌ టెన్షన్‌కు దారితీస్తుంది. అందుకే వయసు పెరిగేకొద్దీ సాధ్యమైనంత సంతోషంగా గడపాలి.దానికోసం ధ్యానం, యోగాను ఎంచుకోవాలి.అలాగే వయసు పెరిగే కొద్దీ చర్మం ఎండిపోయి ముడతలు పడుతుంది . అందుకే రోజూ 6 నుంచి 8 గ్లాసుల నీళ్ళను తాగాలి. రోజుకు కనీసం 6 నుంచి- 8 గంటలు నిద్రపోవాలి. ఆహారంలో తాజా పండ్లు , ఆకుకూరలు , కూరగాయలు తప్పకుండా తీసుకోండి. వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్ల వల్ల చర్మం ముడతలు పడకుండా తాజాగా కనిపిస్తుంది. దాంతో వృద్ధాప్య ఛాయలు తగ్గించుకోవచ్చు.