గొంతు కోసం చంపి.. బురదలోపడేసి కారం చల్లారు

గొంతు కోసం చంపి.. బురదలోపడేసి కారం చల్లారు

నల్గొండ: నిడమనూరు మండలం  నారమ్మ గూడెం సత్యనారాయణ పురం వెళ్లే దారిలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి పొలం బురదలో పడేసి కారం చల్లి వెళ్లిపోయారు దుండగులు. గురువారం జరిగిన ఘటన సంచలనం రేపింది. హత్యకు గురైన యువకుడు మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన మచ్చ శ్రీకాంత్ గా  గుర్తించారు పోలీసులు. పాత కక్షలా ? లేక.. వివాహేతర సంబంధాలా?.. అన్నది అర్థం కావడం లేదని పోలీసులు చెబుతున్నారు. దుండగులు తమ ఆచూకీ తెలియకుండా ఉండేందుకు.. పోలీసు కుక్కలు తమ వాసన గుర్తించే ప్రమాదం ఉందని ఊహించి ముందు జాగ్రత్తగా హత్య జరిగిన ప్రాంతంలో కారం చల్లినట్లు కనిపిస్తోంది.