ఆధార్​తో లింక్​​ చేసుకోకుంటే.. పాన్​కార్డు పనిచేయదు

ఆధార్​తో లింక్​​ చేసుకోకుంటే.. పాన్​కార్డు పనిచేయదు

న్యూఢిల్లీ: ఇప్పటికీ ఆధార్​కార్డుతో పాన్​కార్డుతో లింక్​ చేసుకోనివాళ్లు తొందరపడాల్సిన సమయం వచ్చింది. ఈ రెండింటిని ఈ నెలాఖరులోపు లింక్​ చేసుకోవాలి. లేకపోతే వచ్చే నెల నుంచి పాన్​కార్డు పనిచేయదని సెంట్రల్​బోర్డ్​ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్​(సీబీడీటీ) ప్రకటించింది. “ఆదాయ- పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయింపు కేటగిరీ కిందకు రాని పాన్ హోల్డర్లందరూ 31.3.2023లోపు తమ పాన్‌‌‌‌ను ఆధార్‌‌‌‌తో లింక్ చేయడం తప్పనిసరి. 01.04.2023 నుండి అన్‌‌‌‌లింక్ అయిన పాన్​కార్డు  పనికిరాకుండా అవుతుంది " అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అస్సాం, జమ్మూకాశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులు "మినహాయింపు వర్గం"లోకి వస్తారని 2017 మేనెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొంది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నిర్వచించిన నాన్-–రెసిడెంట్, మునుపటి సంవత్సరంలో ఏ సమయంలోనైనా కనీసం 80 సంవత్సరాల వయస్సు ఉండి, భారతీయ పౌరసత్వం లేని వారు కూడా ఈ వర్గంలోకి వస్తారు. లింక్​ కాని పాన్​కార్డుతో ఐటీ రిటర్న్‌‌‌‌ను సమర్పించడం సాధ్యం కాదు.  పెండింగ్‌‌‌‌లో ఉన్న రిటర్న్‌‌‌‌లు ప్రాసెస్ కావు. పెండింగ్‌‌‌‌లోని ఉన్న ప్రొసీడింగ్స్​పూర్తి కావు. రీఫండ్స్​ పొందడమూ కుదరదు. పన్ను మినహాయింపులకు అధిక రేటు వర్తిస్తుంది.


పాన్​-ఆధార్​కార్డ్​ లింకింగ్​ ఇలా


1. ఆదాయపు పన్ను ఈ–-ఫైలింగ్ అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ eportal.incometax.gov.in లేదా incometaxindiaefiling.gov.inకి వెళ్లండి
2.   పోర్టల్‌‌‌‌లో ఇప్పటికే రిజిస్ట్రేషన్​ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్​ చేసుకోండి. పాన్ నంబరే యూజర్ ఐడీ అవుతుంది.
3. మీ యూజర్ ఐడీ, పాస్‌‌‌‌వర్డ్  పుట్టిన తేదీని రిజిస్టర్​చేయడం ద్వారా పోర్టల్‌‌‌‌లోకి లాగిన్ అవ్వండి.
4. మీ పాన్‌‌‌‌ను ఆధార్‌‌‌‌తో లింక్ చేయాలని అడుగుతున్న పాప్- అప్ విండో ఇప్పుడు కనిపిస్తుంది.
5. విండో కనిపించకపోతే, మెనూ బార్‌‌‌‌లోని ‘ప్రొఫైల్ సెట్టింగ్స్’కి వెళ్లి ‘లింక్ ఆధార్‌‌‌‌’పై క్లిక్ చేయండి.
6. మీ పాన్ కార్డ్ వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ,  లింగం వంటి సమాచారం అప్పటికే కనిపిస్తుంది.
7. ఆధార్‌‌‌‌లో పేర్కొన్న వాటితో స్క్రీన్‌‌‌‌పై పాన్ వివరాలను వెరిఫై చేయండి.
8. ఏవైనా తేడాలు ఉంటే, డాక్యుమెంట్లలో మార్పులు చేసుకోవాలి. 
9. వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్‌‌‌‌ను రిజిస్ట్రేషన్​ చేసి, ‘లింక్ నౌ’ బటన్‌‌‌‌పై క్లిక్ చేయండి.
10. మీ ఆధార్ మీ పాన్‌‌‌‌కి విజయవంతంగా లింక్ అయిందంటూ ఒక పాప్-అప్ మెసేజ్​ వస్తుంది. మీ ఇంటి దగ్గర్లోని మీసేవ వంటి పాన్​సర్వీస్​ సెంటర్లలోనూ ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. అక్కడికి వెళ్తే ‘అనెగ్జర్–1’ ఇస్తారు. దీనిని నింపి పాన్​, ఆధార్​కార్డు ఇవ్వాలి. కొంత సర్వీసు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.