యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సీపీ ఎం.శ్రీనివాస్

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి  : సీపీ ఎం.శ్రీనివాస్

గోదావరిఖని, వెలుగు: యువత మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్​ సూచించారు. యాంటీ నార్కోటిక్స్‌‌‌‌ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై రూపొందించిన వాల్‌‌‌‌ పోస్టర్‌‌‌‌ను సీపీ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయికి బానిసలుగా మారి తమ భవిష్యత్‌‌‌‌ను నాశనం చేసుకుంటున్నారన్నారు. దీంతోపాటు గోదావరిఖని వన్​టౌన్ ​పీఎస్‌‌‌‌లో డీజే ఆపరేటర్లు, ఓనర్లకు ఏసీపీ ఎం.రమేశ్​ కౌన్సెలింగ్​ చేశారు. ఇన్‌‌‌‌స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, బి.రవీందర్​, అజయ్​, వెంకట్​పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ డీసీపీ(అడ్మిన్​) సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సీసీఆర్బీ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ బుద్దే స్వామి, తదితరులు పాల్గొన్నారు.