ఫేక్ అకౌంట్లపై ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఉక్కుపాదం మోపుతోంది. సంస్థ గైడ్ లైన్స్‌కు విరుద్ధంగా తప్పుడు, ఆశ్లీల, చైల్డ్ అబ్యూస్, భయానక కంటెంట్ క్రియేట్ చేస్తోన్న అకౌంట్లపై ఎప్పటికప్పుడూ నిషేదం విధిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల వేల సంఖ్యలో ఫేక్ అకౌంట్లను యూట్యూబ్ బ్యాన్ చేసింది. అయితే ఇక్కడ అనుకోకుండా ఓ పొరపాటు జరిగింది.
స్పామ్ అకౌంట్లు అనుకుని ఎప్పుడూ సంస్థ రూల్స్ బ్రేక్ చేయని కొన్ని ఖాతాలపై యూట్యూబ్ నిషేదం విధించింది. దీంతో అకౌంట్ వినియోగారులు ఆందోళనకు గురి అయ్యారు. ఈ విషయాన్ని వెంటనే యూట్యూబ్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. అకౌంట్లు బ్యాన్ చేయడం వల్ల తాము సేవ్ చేసుకున్న ప్లే లిస్ట్‌లు, లైబ్రరీ యాక్సెస్ కోల్పోవడంపై ఫాలోవర్స్ నిరాశ వ్యక్తం చేశారు. వరుస ఫిర్యాదులు అందటంతో వెంటనే యూట్యూబ్ ప్రతినిధులు అప్రమత్తమై.. కంప్లైంట్లను పరిశీలించారు.
స్పామ్ అకౌంట్ల నిషేదంలో భాగంగా పొరపాటున బ్యాన్ చేయబడిన ఖాతాలను తిరిగి పునరుద్ధిరించే పనులు మొదలు పెట్టారు. దీనిపై యూట్యూబ్ స్పందిస్తూ.. పొరపాటున బ్యాన్ చేయబడిన అకౌంట్లను తిరిగి పునరిద్ధరిస్తున్నామని తెలిపింది. యూట్యూబ్ టీవీ, ప్రీమియం, మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌లకు యాక్సెస్‌ను తిరిగి పునరుద్ధరించడానికి చురుకుగ్గా పని చేస్తున్నామని వెల్లడించింది. ప్లే లిస్ట్, లెబ్రరీలో సేవ్ చేసుకున్న కంటెంట్‌ను త్వరలో పునరుద్ధరించబడుతుందని పేర్కొంది.