కొత్త అప్ డేట్స్ ని విడుదల చేసిన యూట్యూబ్

కొత్త అప్ డేట్స్ ని విడుదల చేసిన యూట్యూబ్

యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ వాళ్లకొచ్చే కామెంట్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ కారణంగా కామెంట్స్ హైడ్, డిజేబుల్ చేయడం, లిమిటెడ్ కామెంట్స్ పెడుతుంటారు. అయితే, అలాంటి కామెంట్స్ ని తగ్గించడానికి యూట్యూబ్.. చాట్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీతో తప్పుడు కామెంట్స్ కి చెక్ పెట్టొ్చ్చు.

యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్ చేసే చాలామందికి స్పామ్, బాట్ కామెంట్స్ వస్తుంటాయి. వాటిని చాట్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా ఆటోమెటిక్ గా నియంత్రించొచ్చు. కంటెంట్ వీడియోల కింద వచ్చే బ్యాడ్ కామెంట్స్ ని కట్టడి చేస్తుంది. తిడుతూ కామెంట్ పెట్టేవాళ్లని యూట్యూబ్ ఆటోమెటిగ్ గా డిటెక్ట్ చేసి వాళ్ల కామెంట్స్ డిలిట్ చేస్తుంది. వాళ్లు కామెంట్స్ పెట్టడం ఆపకపోతే 24 గంటలు నిషేదం విధిస్తుంది. లేదా శాశ్వతంగా వాళ్ల అకౌంట్ ని బ్యాన్ చేస్తుంది.