యూట్యూబ్ నుంచి 17 లక్షల వీడియోలు డిలీట్

యూట్యూబ్ నుంచి 17 లక్షల వీడియోలు డిలీట్

యూట్యూబ్.. భారతోలో కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉల్లంఘించిన 17 లక్షల యూట్యూబ్ వీడియోలను, 73.7 కోట్ల కామెంట్లను తొలగించింది. దీనికి కారణం భారత్ లో యూట్యూబ్ చూసేవాళ్ల సంఖ్యతో పాటు, కంటెంట్ క్రియేటర్స్ కూడా పెరిగిపోయారు. దానివల్ల అశ్లీత, అసత్య ప్రచారాలు కూడా బాగా పెరిగిపోయాయి. వాటిని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న యూట్యూబ్, ప్రపంచవ్యాప్తంగా 56 లక్షల వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించింది. 

2022 జులై నుంచి సెప్టెంబర్ మధ్యన ప్రపంచ వ్యాప్తంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న 1.7 మిలియన్ వీడియోలను డిలీట్ చేసినట్లు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో యూట్యూబ్ వెల్లడించింది. అందులో 36 శాతం వీడియోలకు సింగిల్ వ్యూ, 31 శాతం వీడియోలకు 10 వ్యూస్ మాత్రమే వచ్చాయని నివేదికలో పేర్కొంది. వాటితోపాటు అసభ్యకర పదజాలంతో ఉన్న 99 శాతం కామెంట్స్ ను తొలగించారు.