వీడియోలో ప్లే అవుతున్న కంటెంట్ అంతా చదువొచ్చు

వీడియోలో ప్లే అవుతున్న కంటెంట్ అంతా చదువొచ్చు

వీడియో స్ట్రీమింగ్​ ప్లాట్​ఫాం యూట్యూబ్​ మరో కొత్త అప్​డేట్​తో యూజర్స్​ ముందుకొస్తోంది. అదే ‘షో ట్రాన్స్‎స్క్రిప్ట్’ బటన్​. ​ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే .. యూట్యూబ్‌‌లో వీడియోలు చూసేటప్పుడు వీడియో కింద ట్రాన్స్‌‌క్రిప్షన్  బటన్​ కనిపిస్తుంది. ఆ బటన్​ క్లిక్​​ చేయగానే యూట్యూబ్ వీడియోలో ప్లే అవుతున్న కంటెంట్ అంతా చదవడానికి వీలుగా టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది. సినిమాలు, స్పీచ్​,  ఇంటర్వ్యూ, పాటలు.. ఇలా కంటెంట్ ఏదైనా  సరే ట్రాన్స్​క్రిప్షన్​ ద్వారా చదివి తేలిగ్గా అర్థం చేసుకోవచ్చన్నమాట. అయితే ఇంతకుముందు కూడా ట్రాన్స్​క్రిప్షన్​ చదివే వెసులుబాటు ఉంది.. కాకపోతే.... కంటెంట్​ని స్క్రోల్ చేయాల్సి ఉండేది. కానీ, త్వరలో రానున్న షో యూట్యూబ్​లో ట్రాన్స్‎స్క్రిప్ట్ బటన్​ నొక్కితే స్క్రోలింగ్​తో పనిలే కుండానే కంటెంట్​ అంతా క్లియర్​గా కనిపిస్తుంది. 

ఇన్​స్టాగ్రామ్​లో కొత్త ఫీచర్​
మొన్నీమధ్య నచ్చని కామెంట్లని ఇతరులు చూడకుండా రిస్ట్రిక్ట్​ చేసింది ఇన్​స్టాగ్రామ్. ఇప్పుడు లైవ్​లో నెగెటివ్​, వల్గర్​ కామెంట్స్​ని కంట్రోల్​ చేయడానికి మరో కొత్త ఫీచర్​ని  తీసుకొచ్చింది . ఈ ఫీచర్​ ద్వారా కంటెంట్​ క్రియేటర్స్​ లైవ్​లోకి వెళ్లినప్పుడు మోడరేటర్స్​ని ఎసైన్​  చేసుకోవచ్చు. వాళ్లు లైవ్​లో వచ్చే నెగెటివ్​ కామెంట్స్​పై రిపోర్ట్​ చేయొచ్చు. లైవ్​లో  పర్టిక్యులర్​ యూజర్స్​ కామెంట్స్​ని స్విఛాఫ్​ చేయొచ్చు కూడా.  ఈ ఫీచర్​ని ఎనబుల్ చేసుకోవడానికి కంటెంట్​ క్రియేటర్స్​ లైవ్​లోకి వెళ్లేటప్పుడు కామెంట్​ బార్​లోని మెను  ఐకాన్​ని క్లిక్​ చేయాలి.. అందులో మోడరేటర్​ కోసం సెర్చ్​ చేయొచ్చు లేదా  ఇన్​స్టాగ్రామ్​ సజెషన్స్​లోంచి కూడా మోడరేటర్​ని సెలక్ట్​ చేసుకోవచ్చు. అన్నట్టు ఈ కొత్త ఫీచర్​ తీసుకొచ్చిన ఇన్​స్టాగ్రామ్​  తమ వీడియో అప్లికేషన్స్​  బూమరాంగ్​, హైపర్​ ల్యాప్స్​ని గూగుల్​ ప్లే స్టోర్​, యాప్​ స్టోర్స్​ నుంచి డిలిట్​ చేయనుందనే వార్తలు వినపడుతున్నాయి.