యాడ్ బ్లాకర్ వాడితే.. వార్నింగ్ నోటిఫికేషన్

యాడ్ బ్లాకర్ వాడితే.. వార్నింగ్ నోటిఫికేషన్

యూట్యూబ్ చూసేటప్పుడు మొదట్లో లేదా మధ్యలో యాడ్స్​ వస్తుంటాయి. ప్రతిసారి అలా వస్తుంటే చిరాకొస్తుంది. పైగా కొన్ని సార్లు యాడ్స్​ స్కిప్ చేసే ఆప్షన్ కూడా ఉండదు. అందుకని చాలామంది యాడ్ బ్లాకర్స్ వాడుతుంటారు.అయితే యాడ్​ బ్లాకర్​ వాడేవాళ్లకు యూట్యూబ్​ ఒక ట్విస్ట్​ ఇచ్చింది. యూట్యూబ్ ఈ మధ్య యాడ్స్​ని పెంచింది. దాంతో చాలామంది యాడ్ బ్లాకర్​ వాడుతున్నారు. అలాంటివాళ్లకు యూpreట్యూబ్ ఒక వార్నింగ్ నోటిఫికేషన్ ఇస్తోంది. 

అదేంటంటే.. యాడ్ బ్లాకర్ డిజేబుల్ చేయకపోతే మూడు వీడియోల తర్వాత బ్లాక్​ చేస్తారట. ఒకవేళ యాడ్స్ రావద్దనుకుంటే ప్రీమియంకు సబ్​స్క్రయిబ్​ కావాలని చెప్పింది. యాడ్ బ్లాకర్స్ వాడొద్దని నోటిఫికేషన్స్ పంపడం మామూలే. కాకపోతే యూట్యూబ్ పై ఆధారపడి ఎంతోమంది క్రియేటర్లు ఉన్నారు. వాళ్లకి  ప్రతిఫలం​ దక్కాలి. యాడ్స్ ద్వారా వచ్చే డబ్బే దానికి ఆధారం. అయినప్పటికీ యూట్యూబ్​  ఫ్రీగానే చూస్తున్నారు. యాడ్స్ వద్దనుకుంటే మాత్రం ప్రీమియంకు సబ్​స్ర్కయిబ్​ చేసుకోవాలి అని సూచించింది యూట్యూబ్.