దేశ ఎకానమీకి సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలుస్తోన్న యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దేశ ఎకానమీకి సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలుస్తోన్న యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 7.6 లక్షల మందికి సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • క్రియేటర్ల రెవెన్యూ పెంచేందుకు మరిన్ని కొత్త ఫీచర్లు
  • గూగుల్ ఫర్ ఇండియాలో పాల్గొన్న సుందర్ పిచాయ్‌

న్యూఢిల్లీ: వీడియో కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందించే యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  దేశ ఎకానమీకి సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలుస్తోంది. లక్షలాది మంది యూట్యూబ్ రెవెన్యూపై ఆధారపడి బతుకుతున్నారు. ఇదే విషయాన్ని ఆక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్ట్ ఎకనామిక్స్ రిపోర్ట్ వెల్లడించింది.  కిందటేడాది దేశ ఎకానమీ (జీడీపీ)కి రూ. 10 వేల కోట్లను యూట్యూబ్‌ కంటెంట్ క్రియేటర్ల యాడ్ చేశారని తెలిపింది.  అంతేకాకుండా 7.5 లక్షల మందికి యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సపోర్ట్ చేస్తోందని వెల్లడించింది.  ఈ రూ.10 వేల కోట్లలో క్రియేటర్లు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ నుంచి పొందిన ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఛానెల్ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూపర్ చాట్  వంటి ఇతర మార్గాల ద్వారా సంపాదించిన రెవెన్యూ  కలిసి ఉంది. అలానే  కంటెంట్ క్రియేట్ చేయడానికి యూట్యూబర్లు ఖర్చు చేసిన అమౌంట్ కూడా  ఇందులో కలిసి ఉంది. అంటే వీడియో ఎడిటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వీడియో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రాఫిక్ డిజైనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రొడ్యూసర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సౌండ్ అండ్ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేకర్ల కోసం చేసిన ఖర్చులు పరిగణనలోకి తీసుకున్నారు. యూట్యూబ్‌ కంటెంట్ క్రియేటర్లు ఎకానమీలో చేసే ఖర్చులను ఈ రూ. 10 వేల కోట్లలో కలిపారు.  2020 లో యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటెంట్ క్రియేటర్లు దేశ ఎకానమీకి రూ.6,800 కోట్లు యాడ్ చేశారని, 6,83,900 మందికి కంపెనీ సపోర్ట్ చేసిందని ఆక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్డ్ రిపోర్ట్  వెల్లడించింది. ఇండియా ఎకానమీకి యూట్యూబ్‌ క్రియేటివ్ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సపోర్ట్ అందించడం ఆనందంగా ఉందని ఈ కంపెనీ సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈస్ట్ ఏషియా డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అజయ్ విద్యాసాగర్ అన్నారు. కంటెంట్ క్రియేటర్లు తమ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎంగేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యేలా కొత్త ఫీచర్లను తీసుకొస్తామని, వీరి రెవెన్యూ పెరగడంలో సాయం చేస్తామని ఆక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్డ్ ఎకనామిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోట్ చేస్తూ  వివరించారు.  మొత్తం 5,633 మంది కంటెంట్ క్రియేటర్లను, 523 బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను, 4,021 మంది యూట్యూబ్‌ యూజర్లను సర్వే చేశాక ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారు చేశామని  ఆక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్డ్ ఎకనామిక్స్ పేర్కొంది. యూట్యూబ్‌ ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కనీసం 10 వేల మంది సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లు ఉంటే వారిని క్రియేటివ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెనూర్లుగా గూగుల్ పరిగణిస్తోంది. యూట్యూబ్‌ నుంచి డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫండ్స్ అందుకుంటున్న కొంత మంది, ఇతర మార్గాల ద్వారా కూడా తమ రెవెన్యూని పెంచుకునే  వీలుకలిపిస్తామని గూగుల్ పేర్కొంది. అంతేకాకుండా ఈ క్రియేటివ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెనూర్లు తమ ఛానెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెయింటైన్ చేయడానికి ఇతరులకు ఉద్యోగాలిస్తున్నారని వివరించింది.   

మేకిన్ ఇండియా ఇంకా బలంగా: పిచాయ్‌‌‌‌‌‌‌‌

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ప్రజల సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తూనే ఇన్నోవేషన్స్‌‌‌‌కు సహరించేలా  రెగ్యులేషన్స్‌‌‌‌ను ప్రభుత్వం తీసుకురావా లని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సలహా ఇచ్చారు.  రానున్న కాలంలో మేకిన్ ఇండియా ట్రెండ్ మరింత విస్తరిస్తుందని ఐటీ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్‌‌‌‌తో మాట్లాడిన ఆయన పేర్కొ న్నారు.  ఇండియా అతిపెద్ద ఎగుమతిదారుగా మారుతుందని అంచనావేశారు. ఓపెన్ అండ్ కనెక్టడ్‌‌‌‌ ఇంటర్నెట్‌‌‌‌తో ఇది సాధ్యమవుతుందని అన్నారు.