బతికేదెట్టా : ఇండియాలో 19 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్..

బతికేదెట్టా : ఇండియాలో 19 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్..

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గానూ భారతదేశంలో జనవరి - మార్చి 2023 మధ్య 1.9 మిలియన్లకు పైగా వీడియోలు తీసివేశారు. అదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గానూ యూట్యూబ్ (YouTube) 6.48 మిలియన్లకు పైగా వీడియోలను తీసివేసింది.

కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ యూట్యూబ్ పొందే ఫ్లాగ్‌లు, పాలసీలను ఎలా అమలు చేస్తుందనే దానిపై గ్లోబల్ డేటాను అందిస్తుంది. జనవరి - మార్చి 2023 మధ్య భారతదేశంలో యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 1.9 మిలియన్లకు పైగా వీడియోలు తీసివేసింది. USలో 6లక్షల 54వేల 968, రష్యాలో 4లక్షల 91వేల 933, బ్రెజిల్ లో 4లక్షల 49వేల 759 వీడియోలు తీసివేసింది,

"ఒక కంపెనీగా ప్రారంభ రోజుల నుంచి, మా కమ్యూనిటీ మార్గదర్శకాలు YouTube కమ్యూనిటీని హానికరమైన కంటెంట్ నుంచి రక్షించాయి. మేము మెషిన్ లెర్నింగ్, హ్యూమన్ రివ్యూయర్‌ల కాంబినేషన్ ను ఉపయోగించి మా విధానాలను అమలు చేస్తాం" అని YouTube తెలిపింది. కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2023 మొదటి త్రైమాసికంలో YouTube 8.7 మిలియన్ ఛానెల్‌లను తీసివేసింది. ఈ సమయంలోనే 853 మిలియన్ కంటే ఎక్కువ కామెంట్స్ ను తీసివేసింది. వీటిలో ఎక్కువ భాగం స్పామ్‌గా ఉన్నాయి. తీసివేసిన కామెంట్స్ లో 99 శాతం ఆటోమేటిక్‌గా గుర్తించబడ్డాయి.