ట్రంప్‌కు షాకిచ్చిన యూట్యూబ్.. అప్‌లోడ్ చేసిన కొత్త వీడియో తొలగింపు

ట్రంప్‌కు షాకిచ్చిన యూట్యూబ్.. అప్‌లోడ్ చేసిన కొత్త వీడియో తొలగింపు

వారం రోజులపాటు అకౌంట్ సస్పెన్షన్..అవసరమైతే పొడిగిస్తామన్న యూట్యూబ్

పదవీ కాలం చివరి రోజుల్లో కూడా వివాదాస్పద సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు యూట్యూబ్ షాకిచ్చింది. ఆయన తాజాగా అప్ లోడ్ చేసిన వీడియోను తొలగించేసింది. తమ విధానాలకు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టే రీతిలో ఉన్న వీడియోను అప్ లోడ్  చేశారని ప్రకటించింది. తమ నిబంధనలు వ్యతిరేకించినందుకు హెచ్చరికగా వారం రోజులపాటు సస్పెన్షన్ విధిస్తున్నామని.. అవసరమైతే సస్పెన్షన్ గడువు పొడిగిస్తామని యూట్యూబ్ స్పష్టం చేసింది. యూట్యూబ్ నిర్ణయంతో ట్రంప్ కొత్త వీడియోలేవీ వారం రోజులపాటు అప్ లోడ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అనేక సోషల్ మీడియా సంస్థలు ట్రంప్ అకౌంట్లపై వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా యూట్యూబ్ కూడా ట్రంప్ కు షాకిచ్చి ఆ సంస్థల సరసన చేరింది. క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత సోషల్ మీడియా సంస్థలన్నీ ట్రంప్ తెంపరి నిర్ణయాలకు బ్రేక్ వేస్తూ.. ఆయన అకౌంట్లను బ్లాక్ చేస్తున్నాయి. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు తాత్కాలికంగా నిషేధం విధించగా.. ట్విట్టర్ ఒక అడుగు ముందుకేసి  ఏకంగా శాశ్వత నిషేధం ప్రకటించడమే కాదు.. ట్రంప్ కు సంబంధించిన సుమారు 70 వేల మంది ట్విట్టర్ అకౌంట్లను కూడా నిలిపేసి తెంపరి ట్రంప్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఇక మిగిలిపోయిన యూట్యూబ్ కూడా అదేబాటలో బ్యాన్ విధించడంతో ట్రంప్ వారం రోజులపాటు కొత్త కంటెంట్ ను అప్ లోడ్ చేయలేని పరిస్థితి. అలాగే ఆ వీడియోపై కామెంట్లను కూడా నిలిపేస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది.

ఇవీ చదవండి

విమానాల్లో తిరిగే ప్రముఖులే ఆ సింగర్ టార్గెట్.. తర్వాత ఏం చేస్తుందంటే

వాట్సప్ కొత్త పాలసీతో ఊపందుకున్నసిగ్నల్, టెలిగ్రామ్

బ్రౌన్‌ రైస్‌.. వైట్‌రైస్‌ ఏది మంచిది?

పాస్‌వర్డ్ మర్చిపోయిండు.. గుర్తురాకపోతే రూ.1,600 కోట్లు హుష్