యూట్యూబ్లో కొత్త ఫీచర్.. ఇకపై షార్ట్స్ రూపంలో కామెంట్ చేయొచ్చు..

యూట్యూబ్లో  కొత్త ఫీచర్.. ఇకపై షార్ట్స్  రూపంలో కామెంట్ చేయొచ్చు..

యూట్యూబ్లో  కొత్త ప్రయోగానికి సిద్ధమైంది గూగుల్ సంస్థ.. యూట్యూబ్ లో మీరు చూసే వీడియోల నుంచి షార్ట్స్ రూపంలో కామెంట్ చేసేందుకు వీలుగా ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ సొంత కంటెంట్ తో షార్ట్స్ రూపంలో కామెంట్లు చేయొచ్చు. యూట్యూబ్ లో వీడియోలపై కామెంట్ చేసేందుకు ఇప్పటికే ఉన్న ఫీచర్ ఇది అడ్వాన్సుడ్  అన్నమాట. క్రియేటర్లు చేసిన షార్ట్ లు Shorts Feed తో పాటు వారి ఛానెల్ పేజీలోనే కనిపనిస్తాయి. ట్రయల్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా Android, iOS వినియోగదారులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

ALSO READ:ఓటీటీలో ఈవారం ఏకంగా 17 సినిమాలు.. సినిమా లవర్స్కి పండగే

దీనితోపాటు గతంలో గూగుల్ రెండు ప్రయోగాలు చేసింది. మొదటిది.. లాంగ్ ప్రెస్ ఫీచర్ ద్వారా వీడియో ప్లేయర్ లో ఎక్కడైనా నొక్కి పట్టుకుంటే వీడియో ప్లే బ్యాక్ స్పీడ్ అటోమెటిక్ గా 2 x కి పెంచుకోవచ్చు. రెండోది.. వీడియో ద్వారా అవసరమైన చోట పెద్ద ప్రివ్యూలో చూడొచ్చు. అంతేకాదు వీడియో ప్లే అవుతున్న సమయంలో ఎలాంటి అడ్డంకులు చేకుండా ఉండేందుకు లాక్ స్క్రీన్ ఫీచర్ పై కూడా గూగుల్ ఎక్స్పరిమెంట్ చేస్తోంది. 

కంపెనీ కొత్త ఫీచర్లను ఆవిష్కరించడం, అన్వేషించడం ద్వారా యూట్యూబ్ లో వీడియోలు వీక్షించే వారి కోసం సరసమైన, ఆకర్షణీయమైన ప్లాట్‌ఫారమ్‌ను నిర్వహించేందుకు గూగుల్ కట్టుబడి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.