యూట్యూబ్లో ఆన్లైన్ కోర్సులు

యూట్యూబ్లో ఆన్లైన్ కోర్సులు

యూట్యూబ్ లో సరికొత్త మార్పులు చేయాలని గూగుల్ భావిస్తోంది. అందులో భాగంగా విద్యారంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఆన్ లైన్ కోర్సులకు ఆదరణ పెరుగుతుండటంతో ‘యూట్యూబ్ లెర్నింగ్’ ప్లాట్ ఫామ్ తీసుకురానుంది. నెల, ఏడాది సబ్ స్క్రిప్షన్ ప్లాన్ విధానంలో ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో అన్నిరకాల సబ్జెక్టులకు చెందిన కోర్సులు ఉంటాయని యూట్యూబ్ ప్రకటించింది.

ఆన్ లైన్ కోర్సుల కోసం నిపుణులైన టీచర్లతో యూట్యూబ్ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. యూట్యూబ్ లెర్నింగ్ లో లైవ్ క్లాస్ లు, రికార్డెడ్ వీడియోలు ఉంటాయి. మీకు కావాల్సిన కోర్స్ వీడియో, క్లాస్ కావాలంటే యూట్యూబ్ కి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం బీటా వెర్షన్ లో ఉన్న ఈ సేవలు, రానున్న 7 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని యూట్యూబ్ ప్రకటించింది. ఈ సర్వీస్ ను తొలుత భారత్, సౌత్ కొరియా, అమెరికాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. యూట్యూబ్ లెర్నింగ్ కనుక సక్సెస్ అయితే బైజూజ్, అన్ అకాడమీ తదితర లెర్నింగ్ ప్లాట్ ఫామ్ లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది.