ఏపీకి ప్రత్యేక హోదాపై.. శరద్ పవార్ ను కలిసిన వైఎస్ షర్మిల

ఏపీకి ప్రత్యేక హోదాపై.. శరద్ పవార్ ను కలిసిన వైఎస్ షర్మిల

NCP అధినేత శరద్ పవార్ ను APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కలిశారు. ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో పవార్ నివాసానికి వెళ్లిన షర్మిల.. ఆయనను కలిశారు. ప్రస్తుతం పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని షర్మిల... శరద్ పవార్ కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.  శరద్ పవార్ ను కలిసిన వారిలో షర్మిలతోపటు కేవీపీ రామచంద్రరావు,రఘువీరా రెడ్డి, జేడి శీలం, గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ లు ఉన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తర్వాత ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడంతో రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ అంశాన్ని పక్కన పెట్టింది. దీంతో ఇప్పటివరకు ప్రధాని మోదీ ప్రభుత్వం.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించలేదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కుదరదని.. అందుకు తగ్గట్లే ఫండ్స్ ను అలకేట్ చేస్తామని కేంద్రం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.