వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్: వైఎస్ అవినాశ్ రెడ్డిపై ఫ్యామిలీకి డౌట్

వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్: వైఎస్ అవినాశ్ రెడ్డిపై ఫ్యామిలీకి డౌట్

అమరావతి : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అనూహ్యమైన మలుపు తిరిగింది. తన తండ్రి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సహా పలువురిపై వివేకా కూతురు సునీత అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే వివేకా భార్య సౌభాగ్యమ్మ, టీడీపీ నేత బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే కేసు దర్యాప్తు తుది దశలో ఉందని ఈ సమయంలో సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏజీ అందుబాటులో లేరని వివరాల సమర్పణకు ప్రభుత్వ లాయర్‌ గడువు కోరారు. అనంతరం తదుపరి విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

హైకోర్టుకు సునీత అందజేసిన అనుమానితుల జాబితాలో ఉన్న పేర్లు

వాచ్‌మన్‌ రంగయ్య, ఎర్ర గంగిరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన సన్నిహితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, సీఐ శంకరయ్య, ఏఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, ఘటనాస్థలంలో ఉన్నవారి, సన్నిహితుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత తమకు కొందరిపై అనుమానాలున్నాయంటూ ఈ జాబితాను సునీత హైకోర్టుకు సమర్పించారు.