కరెంట్ ఉత్పత్తి, కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయాలె : వైఎష్ షర్మిల

కరెంట్ ఉత్పత్తి, కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయాలె : వైఎష్ షర్మిల

జనగామ జిల్లా : రాష్ర్టంలో ఎక్కడ చూసినా కరెంట్ కోతలే ఉన్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు యాసంగి సీజన్ పై ఎలాంటి ప్లానింగ్ లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కనీసం 5 గంటలు కూడా కరెంట్ అందడం లేదన్నారు. 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నామంటూ కేసీఆర్.. తన మాటలతో ఊదర గొడుతున్నారని వ్యాఖ్యానించారు. రైతులు ఆందోళనలు చేస్తుంటే అబద్ధాలు చెబుతూ..గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. అమ్మాపూర్ గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

మొత్తం విద్యుత్ వ్యవస్థనే ముఖ్యమంత్రి కేసీఆర్ భ్రష్టు పట్టించారంటూ షర్మిల మండిపడ్డారు. పవర్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీలను దివాళా తీయించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసమే రూ.5 వేల కోట్లు కరెంట్ బిల్లులు కట్టాల్సి ఉందన్నారు. కాళేశ్వరం నిర్మాణానికి తీసుకున్న అప్పుల కింద ప్రతి ఏడాది రూ.13 వేల కోట్లు కట్టాలని చెప్పిన షర్మిల.. రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి, కొనుగోలుపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.