కోవిడ్ కట్టడికి చైనా కఠిన ఆంక్షలు

కోవిడ్ కట్టడికి చైనా కఠిన ఆంక్షలు

జీరో కొవిడ్ లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో చైనాలోని షాంఘై సిటీలో అత్యంత కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మరికొన్ని రోజులు షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో  ప్రజలను ఫుడ్ కోసం, హాస్పిటల్ కు వెళ్లేందుకు కూడా వీధుల్లోకి వచ్చేందుకు అనుమతించట్లేదు అధికారులు. పలు ప్రాంతాల్లో ఆహార సరఫరా సేవలను కూడా నిలిపేయాలని నిర్ణయించింది. హాస్పిటల్ లో కూడా ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే తొలి ప్రాధాన్యమివ్వనుంది. అంతేకాదు.. కొవిడ్  సోకిన వ్యక్తుల పొరుగువారు, సన్నిహితులను కూడా గవర్నమెంట్  క్వారంటైన్  కేంద్రాలకు తరలిస్తున్నారు. 

చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కొవిడ్  ఆంక్షలు విధించి ఏడు వారాలు అవుతోంది.కరోనా  కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో అధికారులు మాత్రం తమ లక్ష్యంగా ఉన్న సొసైటల్  జీరో ను అందుకోలేకపోతున్నారు. క్వారంటైన్ లో ఉన్న వారిలో తప్ప బయట ఎక్కడా కొత్త కొవిడ్  కేసు రాకూడదనేది సొసైటల్  జీరో లక్ష్యం.  మరోవైపు కఠిన ఆంక్షలను షాంఘై అధికారులు సమర్థించుకుంటూ.. షాంఘైలోని సగం ప్రాంతాలకు నిబంధనల లేవని చెబుతున్నారు. మరోపక్క వైద్య సిబ్బంది షాంఘైలోని పలు ప్రాంతాలకు వెళ్లి కలిసి ఫొటోలు దిగిన చిత్రాలను చైనా మీడియా ప్రచారం చేస్తోంది. 

చైనా షాంఘైలో సైలెంట్  పీరియడ్  పేరుతో కఠిన ఆంక్షలను విధిస్తోంది. వచ్చే మూడు రోజులు అమలు చేయనుంది. దీనిలో కేవలం ప్రభుత్వ ఆహార సరఫరాలను మాత్రమే అనుమతిస్తారు. స్థానికులు ఎవరూ గడపదాటి బయటకు రాకూడదు. ఎమర్జెన్సీ కేసులు కాకుండా ఎవరైనా హాస్పిటల్ వెళ్లాలంటే కమిటీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. కొవిడ్  బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని బలవంతంగా సెంట్రల్  క్వారంటైన్  సెంటర్లకు తరలిస్తున్నారు. వారి ఇళ్లను డిస్ ఇన్ఫెక్ట్   చేయడానికి ఇంటి తాళాలను తలుపుల వద్ద ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. దీన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.