కొత్త ఫీచర్లు అదుర్స్

కొత్త ఫీచర్లు అదుర్స్

స్మార్ట్​ఫోన్​, ఎలక్ట్రానిక్​ గాడ్జెట్స్, వెబ్​బ్రౌజింగ్​ యాప్స్... ఏవైనా సరే కొత్త ఫీచర్లు ఉండాల్సిందే. యూజర్ల ఇంట్రెస్ట్​, కంఫర్ట్​ని దృష్టిలో పెట్టుకుని ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లు, అప్​డేట్స్​తో వస్తూ ఉంటాయి. జూమ్​ వీడియో కాల్​ యాప్​, గూగుల్​ వాయిస్​, యాపిల్​ ఐఫోన్​లో కొత్తగా రానున్న ఫీచర్లివే.

జూమ్​ కొత్త ఫీచర్లివే
వీడియో కాల్ కోసం  జూమ్​ యాప్​ వాడుతుంటారు చాలామంది. తాజాగా జూమ్​ యూజర్లకు కొత్త ఫీచర్​ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్​లో ఆటోమేటిక్​ ఫోకస్​ మోడ్​, వర్క్​ప్లేస్​ రిజర్వేషన్స్ సదుపాయం ఉండనుంది. అంతేకాదు వీడియో మెయిల్స్ పంపొచ్చు.  క్లౌడ్​ వీడియో కాల్​ రికార్డింగ్​ని షేర్​ చేసుకోవచ్చు కూడా.  

జూమ్​ మీటింగ్స్ 
జూమ్​ మీటింగ్స్​ కండక్ట్ చేసేవాళ్లు ఇకపై ఫోకస్​ మోడ్​ ఎనబుల్​ చేసి మీటింగ్​ షెడ్యూల్​ చేయొచ్చు. దాంతో మీటింగ్​లో పార్టిసిపేట్​ చేసేవాళ్లకి డిస్టర్బెన్స్ లేకుండా చూడొచ్చు. ప్రతి మీటింగ్​ ఐడీకి ‘గ్యాలరీ వ్యూ’ కూడా ముందే సెట్​ చేసుకోవచ్చు. దాంతో ప్రతిసారి కెమెరాని అడ్జస్ట్​ చేయాల్సిన పని ఉండదు.  ఇది పెయిడ్​ ఫీచర్. ప్రస్తుతానికైతే ఈ ఫీచర్​ ఐపాడ్​లో మాత్రమే పనిచేస్తుంది. రిమోట్​ ఏరియాలో, ఆన్​సైట్​ వర్క్​స్పేస్​లో యూజర్లకు సౌకర్యంగా ఉంటుంది. అమెజాన్ ఫైర్​ టీవీ వాడేవాళ్లు లివింగ్​ రూమ్​ నుంచే జూమ్​ యాప్​ ఉపయోగించుకోవచ్చు. అందుకోసం1080 పిక్సెల్​ వెబ్​కెమెరా కావాల్సి ఉంటుంది. 

జూమ్​ ఛాట్​
మిస్​ అయిన వీడియో కాల్స్​ ఛాట్​లో కనిపి స్తాయి. దాంతో వెంటనే చెక్​ చేసుకోవచ్చు. నోటి ఫికేషన్​ మీద క్లిక్​ చేస్తే నేరుగా జూమ్​ మీటింగ్​లో పార్టిసిపేట్​ చేయొచ్చు. అంతేకాదు జూమ్​ ఛాట్​ వీడియోల్ని ఫోన్​లో సేవ్​ చేసుకునే వీలుంటుంది. 

గూగుల్​ వాయిస్​లో కొత్త ఫీచర్​
గూగుల్​ వాయిస్​ ద్వారా వెబ్​ బ్రౌజర్​ లేదా ఫోన్​ నుంచి డొమెస్టిక్​, ఇంటర్నేషనల్​ కాల్స్​ చేయొచ్చని తెలిసిందే. ఇప్పుడు గూగుల్​ వాయిస్​లో మరో ఫీచర్​ యాడ్​ అయింది. దీంతో ఇన్​కమింగ్​ కాల్స్​కి కస్టమ్​ రూల్స్​ సెట్​ చేసుకోవచ్చు. ఈ ఫీచర్​ సాయంతో యూజర్లు కాల్స్​ను స్పెసిఫిక్​ కాంటాక్ట్స్​ నుంచి లింక్​డ్​ ఫోన్​ నెంబర్​ లేదా వాయిస్​ మెయిల్​కి ఫార్వర్డ్ చేయొచ్చు. అంతేకాదు ముఖ్యమైన కాంటాక్ట్స్​ నుంచి వచ్చే కాల్స్​లో  స్క్రీన్​ కాల్​ని ఎంచుకోవచ్చు. వాయిస్​ మెయిల్​ గ్రీటింగ్స్​ పంపొచ్చు కూడా. కాంటాక్ట్స్​లోని కొన్ని గ్రూపులకి ఈ రూల్స్​ని అప్లై చేయొచ్చు. 

ఇంగ్లీషు అర్థంకానివాళ్ల కోసం
స్టార్ట్​ఫోన్​లోని  యాప్స్ చాలావరకు ఇంగ్లీషులోనే ఉంటాయి. దాంతో ఇంగ్లీషు అర్థంకానివాళ్లు వాటిని ఉపయోగించడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటివాళ్లకోసం గూగుల్​ త్వరలోనే కొత్త ఫీచర్​ తీసుకు రానుంది. ఆండ్రాయిడ్​ ఫోన్​లోని అన్ని యాప్స్​లోని కంటెంట్​ని ట్రాన్స్​లేట్​ చేసే ఫీచర్​ తెచ్చే ప్రయత్నంలో ఉంది గూగుల్. ఆండ్రాయిడ్​ కొత్త వెర్షన్​లో (ఆండ్రాయిడ్​ 13 ఫోన్లలో) ఈ ఫీచర్​ అందుబాటులోకి రానుంది. ‘పాన్​లింగ్వువల్​’గా పిలిచే ఈ ఫీచర్​ గనుక వస్తే, ఇంగ్లీషు డీఫాల్ట్​ లాంగ్వేజ్​గా ఉన్నప్పటికీ,  సిస్టమ్​ సెట్టింగ్స్​ చేయకుండానే లోకల్​ లాంగ్వేజ్​లో సోషల్​మీడియా యాప్స్​ని వాడుకోవచ్చు.