కళ్యాణ్ దేవ్ కిన్నెరసాని వస్తోంది

కళ్యాణ్ దేవ్  కిన్నెరసాని వస్తోంది

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న  చిత్రం ‘కిన్నెరసాని’. రమణ తేజ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో రామ్ తాళ్లూరి, రవి చింతల నిర్మిస్తున్నారు. షీతల్, కశిష్ ఖాన్ హీరోయిన్స్. కన్నడ నటుడు రవీంద్ర విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేసిన దర్శక నిర్మాతలు నిన్న ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని రిలీజ్ చేశారు. ‘నీ ముందున్న సముద్రపు అలల్ని చూడు.. కోపగించుకుని సముద్రాన్ని వదిలి వెళ్లిపోతున్నట్టున్నాయి. కానీ సముద్రం వాటిని వదలదు, వదులుకోలేదు. నేను కూడా అంతే’ అనే హీరోయిన్ డైలాగ్‌‌‌‌‌‌‌‌తో స్టార్టయిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా సాగింది. ‘కారణం లేని ప్రేమ, గమ్యం లేని ప్రయాణం  చాలా గొప్పవి’ లాంటి డైలాగ్స్ ఇంప్రెస్ చేశాయి. కళ్యాణ్ దేవ్ ఇంటెన్స్ లుక్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నాడు.  విజువల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు  మహతి స్వరసాగర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయి. మొత్తంగా  ఇదో మంచి మిస్టీరియస్ థ్రిల్లర్ అనే ఫీల్ కలిగింది.