
న్యూఢిల్లీ: ప్రముఖ మహిళల ఫొటోలను వేలానికి పెట్టిన బుల్లీ బాయ్ యాప్ క్రియేటర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో మాస్టర్ మైండ్ గా అనుమానిస్తున్న నీరజ్ బిష్ణోయ్(21)ని అస్సాంలో అదుపులోకి తీసుకున్నట్లు గురువారం మీడియాకు తెలిపారు. నీరజ్ వద్ద యాప్ ను డెవలప్ చేసేందుకు ఉపయోగించిన డివైజ్ను స్వాధీనం చేసుకున్నారు. అస్సాంలోని దిగంబర్ జొర్హాట్కు చెందిన నీరజ్.. భోపాల్లోని వెల్లూర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడని పోలీసులు చెప్పారు. గిట్హబ్ ప్లాట్ఫామ్ ద్వారా బుల్లీ యాప్ రూపొందించింది ఇతడేనని, ఈ మొత్తం వ్యవహారంలో నీరజే ప్రధాన నిందితుడని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ముంబై సైబర్ సెల్ పోలీసులు మయాంక్ రావల్(21), శ్వేతా సింగ్(19), విశాల్ కుమార్ ఝాను అరెస్ట్ చేసి వాంగ్మూలాలు సేకరించారు.