కేంద్రంపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ ఆగ్రహం

కేంద్రంపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ ఆగ్రహం

షిల్లాంగ్: సాగు చట్టాల విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పలు వ్యాఖ్యలు చేశారు. అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరసనల్లో వందలాది మంది రైతులు చనిపోతే కనీసం సంతాపం తెలపరా అని మోడీ సర్కార్‌ను ఆయన దుయ్యబట్టారు. ఓ జంతువు చనిపోతే సంతాపం చెప్పే ఢిల్లీ లీడర్లు.. 600 మంది రైతులు అమరులైతే మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  

‘దేశం మునుపెన్నడూ ఇలాంటి ఉద్యమాన్ని చూడలేదు. ఇప్పటివరకు రైతులు చేపట్టిన నిరసనల్లో 600 మంది అమరులయ్యారు. ఒక జంతువు చనిపోతే ఢిల్లీ నేతలు సంతాపం చెబుతారు. కానీ వందలాది అన్నదాతలు చనిపోతే వారి ప్రస్తావనే లేదు. ఇది సరికాదు. మీరు పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రధాని మోడీకి వివరించా. ఈ సిక్కు, జాట్ రైతులను ఓడించలేమని చెప్పా. రైతులు ఉద్యమాన్ని ఆపేస్తారని అందరూ అనుకున్నారు. కానీ రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వారిని ఒట్టిచేతులతో పంపొద్దు. వారు దీన్ని వందేళ్లయినా మర్చిపోరు’ అని సత్యపాల్ మాలిక్ చెప్పారు. 

మరిన్నివార్తల కోసం: 

తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం కొంటదా? లేదా?

కేసీఆర్ కచ్చితంగా జైలుకు పోక తప్పదు