భారత్, పాక్ పేసర్ల మధ్య తేడా అదే..

భారత్, పాక్ పేసర్ల మధ్య తేడా అదే..

టీమిండియా పేస్ బౌలింగ్ దళంపై పాకిస్థాన్ మాజీ స్పీడ్స్టర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొన్నేళ్లలో భారత పేస్ లైనప్ బలంగా మారిందని.. కానీ పాకిస్థాన్ టీమ్ తో పోలిస్తే ఎనర్జీ విషయంలో వెనుకపడిందన్నారు. భారత్ నుంచి మంచి పేస్ బౌలర్లు వస్తున్నారని.. అయితే వారి బౌలింగ్ లో ఎనర్జీ కొరవడుతోందన్నారు. స్పీడ్స్టర్లకు ఉండాల్సిన యాటిట్యూట్ వారిలో లేదని.. భారత్, పాక్ బౌలర్ల మధ్య ఇదే కీలక వ్యత్యాసం అన్నారు. 

‘భారత్ మంచి బౌలర్లను తయారు చేస్తోంది. కానీ పేస్ బౌలర్లకు ఉండాల్సిన యాటిట్యూడ్, ఎనర్జీ, బ్యాట్స్ మెన్ ను వణికించే తత్వం వారిలో కొరవడుతోంది. పాక్ బౌలర్లతో పోల్చుకుంటే ఎనర్జీ విషయంలో టీమిండియా పేసర్లు వెనుక ఉన్నారనే చెప్పాలి. దీనికి ఇరు జట్ల మధ్య ఉన్న వాతావరణం, తినే భోజనంలో ఉన్న తేడాలు కూడా కారణమే. పేస్ బౌలర్లు బలమైన భోజనం తీసుకోవడంతోపాటు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. అప్పుడే వారు వేగంగా, కచ్చితత్వంతో బౌలింగ్ చేయడం సాధ్యమవుతుంది. పాక్ బౌలర్లు నాన్ వెజిటేరియన్ డైట్ ను పక్కాగా అనుసరిస్తారు. అది వారికి లాభిస్తోంది. మా ప్లేయర్లు పాక్ లో దొరికే పలు రకాల జంతువులను తింటుంటారు. అందుకే వారు సింహాల్లా పరిగెత్తుతూ బౌలింగ్ చేస్తారు’ అని అక్తర్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తల కోసం:

భీమ్లా నాయక్ సినిమాపై వర్మ సంచలన ట్వీట్లు

సిటీలో పెరుగుతున్న హోమ్​ ఫుడ్ స్టోర్లు

ఆర్థిక ఇబ్బందులతోనే డ్రగ్స్ బిజినెస్‌‌‌‌లోకి