అనుమానాస్పదంగా మహిళ మృతి ..కరీంనగర్ జిల్లా జమ్మికుంట టౌన్ లో ఘటన

అనుమానాస్పదంగా మహిళ మృతి ..కరీంనగర్ జిల్లా జమ్మికుంట టౌన్ లో ఘటన
  • మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం

జమ్మికుంట, వెలుగు : అనుమానాస్పదంగా భార్య మృతిచెందగా, భర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం..  జమ్మికుంట లెక్చరర్ కాలనీకి చెందిన దిడ్డి శ్రీదేవి(53), సుధాకర్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కాగా వీరి కొడుకు ఫారిన్ లో, కూతురు హైదరాబాద్ లో ఉంటున్నారు. 

బుధవారం తెల్లవారుజామున శ్రీదేవి ఇంట్లో సోఫాలో చనిపోయి పడి ఉన్నారు. భార్య మృతిని తట్టుకోలేక సుధాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పక్కింటివాళ్లు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

 భార్యకు గుండెపోటు వచ్చి చనిపోయిందని, ఆమె లేకుండా తాను జీవించలేనని పురుగుల మందు తాగి సూసైడ్ యత్నించినట్టు సుధాకర్ తెలిపాడు.  టౌన్ కు చెందిన ఓ వ్యక్తికి డబ్బులు ఇవ్వడంతో దంపతుల మధ్య గొడవలు జరుగున్నట్టు స్థానికులు చర్చించుకుంటు న్నారు. 

మృతురాలి తల్లి తిరుపతమ్మ తన కూతురు మృతికి అనారోగ్యం కారణమా..!  లేక మరే ఇతర కారణాలతో మృతిచెందిందా..! అని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.