మరో అద్భుతం సృష్టించిన చైనా.. జెల్లీఫిష్ వంటి రోబో తయారీ

మరో అద్భుతం సృష్టించిన చైనా.. జెల్లీఫిష్ వంటి రోబో తయారీ

బీజింగ్: చైనా జెల్లీఫిష్ వంటి రోబోను అభివృద్ధి చేసింది. అండర్ వాటర్ మిషన్ల కోసం రూపొందించడంతో దీన్ని అండర్ వాటర్ ఫాంటమ్ అని కూడా పిలుస్తారు. నార్త్‌‌ వెస్ట్రన్ పాలిటెక్నికల్ యూనివర్సిటీకి చెందిన టావో కై రూపొందించిన ఈ రోబో నిజమైన జెల్లీ ఫిష్‌‌‎ను పోలి ఉంటుంది. సముద్ర జీవులకు అంతరాయం కలిగించకుండా అక్కడి వాతావరణాలను పర్యవేక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. హైడ్రో జెల్ ఎలక్ట్రోడ్ పదార్థంతో తయారు చేయడంతో దీని శరీరం, టెంటకిల్స్ జెల్లీ ఫిష్ కదలికలకు దగ్గరగా ఉంటాయి. 

ఈ రోబో 120మీ.మీ. డయామీటర్, 56 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇది జెల్లీ ఫిష్ న్యూరల్ సిగ్నల్‌‎లను అనుకరించే ఎలక్ట్రోస్టాటిక్ హైడ్రాలిక్ యాక్యుయేటర్‌‎ను ఉపయోగించి నీటి అడుగున కదులుతుంది. ఈ రోబో 28.5 మిల్లీవాట్ల వద్ద పనిచేస్తుంది. కెమెరా, ఏఐ చిప్ ఉండటంతో మెషీన్ లెర్నింగ్ సహాయంతో నీటి అడుగున ఉండే వాటిని సులభంగా గుర్తించగలదు. ఈ బయోనిక్ జెల్లీ ఫిష్‌‌ ను ఆగస్టులో ఆ దేశ ప్రసార సంస్థ సీసీటీవీ ఒక సైన్స్ ప్రోగ్రామ్ లో ప్రదర్శించింది.