చైనాలో న్యూమోనియా ఎఫెక్ట్.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

చైనాలో న్యూమోనియా ఎఫెక్ట్.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

న్యూఢిల్లీ: చైనాలో న్యూమోనియా కేసులు పెరుగుతుండంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. నార్త్ చైనాలోని చాలా స్కూళ్లలో కరోనా తరహా లక్షణాలతో చిన్న పిల్లలు బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు హాస్పిటల్స్​లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వైద్య సౌకర్యాలు మెరుగుపర్చుకోవాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో హెల్త్ సెక్రటరీ సూచించారు. 

చలి కాలం కావడంతో శ్వాసకోశ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ చేస్తున్నదని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. తమ తమ రాష్ట్రాల్లో పబ్లిక్ హెల్త్​తో పాటు హాస్పిటల్స్​లోని సౌకర్యాలపై రివ్యూ చేసుకోవాలని సూచించారు. చిన్నారుల్లో తలెత్తే శ్వాస సంబంధిత వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు నమోదయ్యే కేసుల డేటా జిల్లా, స్టేట్‌‌ సర్వేలైన్స్ యూనిట్లలో అప్‌‌లోడ్‌‌ చేయాలని తెలిపారు. శ్వాస కోశ వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు సంబంధించిన శాంపిల్స్​ను టెస్టింగ్ కోసం వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబోరేటరీలకు పంపించాలని ఆదేశించారు.