హోటల్ – మోటెల్ – రెస్టారెంట్ మధ్య తేడా ఏంటీ.. 95 శాతం మందికి తెలియదంట..

హోటల్ – మోటెల్ – రెస్టారెంట్ మధ్య తేడా ఏంటీ.. 95 శాతం మందికి తెలియదంట..

మన రోజువారీ జీవితంలో మనం తరచుగా వినే, ఉపయోగించే అనేక పదాలను చూస్తూ ఉంటాం. ఆ పదం గురించి మనకు సరైన అర్థం తెలియకపోవచ్చు. కొన్ని సార్లు ఎవరో చెప్పిన అర్థాలను అవే నిజాలుగా భావించి అవే అసలైన అర్థాలని పొరబడుతూ ఉంటాం. ఫలితంగా కొన్ని సార్లు ఊహించలేని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మందికి తెలియని మూడు పదాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మనలో చాలా మందికి ఓకే, సారీ వంటి సాధారణ పదాల మధ్య అసలు అర్థం, తేడా తెలియదు. అదే తరహాలో హోటల్, మోటెల్, రెస్టారెంట్ వంటి పదాల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి ఈ మూడు పదాల అర్థాన్ని, తేడాలేంటో ఇప్పుడు చూద్దాం.

హోటల్ అయినా, మోటెల్ అయినా, రెస్టారెంట్ అయినా.. ఇవన్నీ ఆతిథ్య రంగంలో భాగమే. ఇవన్నీ వివిధ రకాల క్లయింట్‌లను అందించే వ్యాపారాలు. హోటల్, మోటెల్ ల ప్రాథమిక లక్ష్యం వసతిని అందించడం, రెస్టారెంట్ లక్ష్యం ఆహారం, ఇతర పానీయాలు అందించడం. కొన్నిసార్లు హోటల్ లోపల కూడా ఒక రెస్టారెంట్ కనిపించవచ్చు.

హోటల్, మోటెల్ మధ్య వ్యత్యాసం:

హోటల్ అంటే లగ్జరీ వసతి ఉన్న ప్రదేశం. ఇది అతిథులకు వసతి, ఆహార సౌకర్యాలను అందిస్తుంది. ఇందులో బెడ్ రూం, బాత్రూమ్, స్విమ్మింగ్ పూల్స్, పిల్లల సంరక్షణ, స్పా, రూమ్ సర్వీస్, పెంపుడు జంతువుల సంరక్షణ, వినోద సౌకర్యాలు వంటి సౌకర్యాలను కూడా ఉంటాయి. అనేక లగ్జరీ హోటళ్లు వ్యాపార సమావేశాలు లేదా ఇతర సమావేశాలను నిర్వహించడానికి సమావేశ మందిరాలను కూడా అందిస్తాయి. హోటల్ రేటింగ్.. వారు అందించే సౌకర్యాలను బట్టి ఒకటి నుంచి ఏడు నక్షత్రాల (వన్ టూ సెవెన్ స్టార్) వరకు ఉంటుంది. హోటళ్లు సాధారణంగా భారీ బహుళ-అంతస్తుల భవనాలు, బహుళ గదులు భవనంతో కూడిన మంచి ఇంటీరియర్‌లను కలిగి ఉంటారు.

ALSOREAD :ప్రస్టేషన్ లేడీస్ : లోకల్ రైల్లో.. చెప్పులతో కొట్టుకున్న వీరనారీలు

హై లెవెల్ లగ్జరీ హోటళ్లు: ఈ కంపెనీలు ఆన్-సైట్ రెస్టారెంట్లతో ఫుల్ సర్వీస్ లాడ్జింగ్స్ తో పాటు, వసతి వంటి సంపన్నమైన సౌకర్యాలను అందిస్తాయి. వీటిలో సాధారణంగా ఫోర్ లేదా ఫైవ్ డైమండ్ లేదా స్టార్ వంటి కేటగిరీలు ఉంటారు. ఇవి ఖరీదైన వసతిని అందిస్తాయి.

ఫుల్ సర్వీస్ హోటళ్లు: ఇవి విలాసవంతమైన, ఫుల్ సర్వీస్ ఫెసిలిటీస్ వంటి సౌకర్యాలను అందిస్తాయి. ఇవి రెస్టారెంట్లు, బస సౌకర్యాలు, సమావేశ స్థలాన్ని అందించే ఉన్నత స్థాయి హోటళ్లను కలిగి ఉంటాయి. ఇందులో ఆన్-సైట్ కేఫ్‌లు లేదా రెస్టారెంట్లు ఉన్న కంపెనీలు కూడా ఉండవచ్చు.

బోటిక్ హోటళ్లు: ఇవి పది నుంచి వంద గదులతో ఉంటాయి. అత్యంత ప్రాథమిక సౌకర్యాలు మాత్రమే కల్పించే ఈ హోటళ్లు.. ప్రయాణికుల కోసం నిరాడంబరమైన వసతిని అందిస్తాయి. ఇవి సాధారణంగా షాపింగ్ సెంటర్లలో ఉండే చిన్న స్పేస్ హోటళ్లు. కస్టమర్‌లకు అల్ట్రా- పర్సనల్ సర్వీస్ ను అందిస్తాయి.

మోటెల్ అనే పదం మోటరిస్ట్ అనే పదం నుండి వచ్చింది. ఇది డ్రైవర్లు లేదా వాహనదారులు రాత్రిపూట స్టే చేసేందుకు అని అర్థం. మోటెల్‌లను దీర్ఘకాలిక, స్వల్పకాలిక బసలకు ఉపయోగించవచ్చు. ఇవి స్మిమ్మింగ్ ఫుల్స్, రూమ్ సర్వీస్ లు కాకుండా కేవలం ప్రాథమిక సౌకర్యాలను మాత్రమే అందిస్తుంది. ఇది సాధారణంగా నేషనల్ హైవే ఏరియాల్లో ఉంటాయి. ఇవి హైవే వెంబడి డ్రైవర్లకు తక్కువ సమయానికి వసతి సౌకర్యాలను అందించేందుకు కుదించబడిన భవనాలను కలిగి ఉంటాయి. వాటి ముందు డ్రైవర్లు తమ వాహనాలను పార్కింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సత్రం అంటే పర్యాటకులు బస చేయడానికి, ఆహారం ఇతర బేసిక్ సదుపాయాలు పొందొచ్చు. ఇవి కూడా ఒక రకంగా చెప్పాలంటే అదే రకంగా ఉంటాయి.

రెస్టారెంట్ అంటే ఏమిటి?

హోటళ్ళు. మోటెల్‌లు దీర్ఘకాలం నుంచి స్వల్పకాలిక వసతిని అందించే ప్రదేశాలుగా విలసిల్లుతుండగా, రెస్టారెంట్ అనేది మాత్రం కేవలం ఆహారం, ఇతర పానీయాలను మాత్రమే అందించే వ్యాపారం. ప్రజలు భోజనాన్ని ఆస్వాదించి, తిరిగి వెళ్లిపోతారు. కొన్ని హోటళ్లు రెస్టారెంట్ సౌకర్యాన్ని అందించవచ్చు. రెస్టారెంట్‌లు అవి అందించే ఫుడ్ విషయంలోనూ చాలా గొప్పగా ఉంటాయి.