ప్రపంచంలోనే ఫస్ట్ టైం

V6 Velugu Posted on Oct 21, 2021

  • అమెరికాలో టెస్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సక్సెస్  

న్యూయార్క్: ప్రపంచంలోనే మొదటిసారి మనిషికి పంది కిడ్నీని అమర్చారు. ఈ ట్రాన్స్ ప్లాంటేషన్ సక్సెస్ అయిందని అమెరికా డాక్టర్లు చెప్పారు. న్యూయార్స్ లోని ఎన్ వైయూ లాంగోన్ హెల్త్ సెంటర్ రీసెర్చర్లు ఈ ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ‘‘బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళకు పంది కిడ్నీని అమర్చాం. ఆమె ఫ్యామిలీ అనుమతితోనే ఇది చేశాం. మూడ్రోజులు కిడ్నీ పనితీరును పరిశీలించాం. అది సాధారణంగానే పని చేసింది. ఆమె ఇమ్యూన్ సిస్టమ్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు” అని ఈ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రాబర్ట్ మోంట్ గోమెరి చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అవయవాలకు కొరత ఉంది. ఒక్క అమెరికాలోనే 1.07 లక్షల మంది ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో 90 వేల మంది కిడ్నీ బాధితులే ఉన్నారు. అవయవాల కొరతను అధిగమించేందుకు, మనుషులకు జంతువుల అవయవాలను అమర్చడంపై కొన్ని దశాబ్దాలుగా రీసెర్చర్లు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రయోగం సక్సెస్ కావడం.. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ లో కీలక ముందడుగు అని రీసెర్చర్లు అంటున్నారు.

జన్యు మార్పులు చేసి.. 
ట్రాన్స్ ప్లాంటేషన్ లో భాగంగా రీసెర్చర్లు కొన్నేండ్లుగా పందులపై దృష్టి పెట్టారు. పంది కణాల్లోని గ్లూకోజ్.. మనిషి ఇమ్యూన్ సిస్టమ్ కు సరిపోలకపోవడంతో రీసెర్చర్లు జన్యు పరంగా మార్పులు చేసిన పంది కిడ్నీని సేకరించారు. మనిషి ఇమ్యూన్ సిస్టం దాడి చేయకుండా ఉండేలా.. దానిలో గ్లూకోజ్ స్థాయి తగ్గేలా చేశారు. ఇలా మార్పులు చేసిన గాల్ సేఫ్ పంది కిడ్నీనే టెస్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు వినియోగించారు. గాల్ సేఫ్ పందుల మాంసాన్ని అలర్జీ ఉన్న వారికి ఫుడ్విలో వాడటంతో పాటు హ్యూమన్ ట్రీట్ మెంట్ కు సంబంధించి ప్రయోగాలు చేస్తున్నారు. ఇందుకు 2020లోనే అమెరికా ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) ఆమోదం కూడా తెలిపింది.

Tagged woman, kidney, Pig,

Latest Videos

Subscribe Now

More News