తెలుగురాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు... గజ గజ వణుకుతున్న ప్రజలు

తెలుగురాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు... గజ గజ వణుకుతున్న ప్రజలు

తెలుగు రాష్ట్రాల్లో చలి వాతావరణం క్రమంగా పెరుగుతోంది. రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. చలి విపరీతంగా ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. గడ్డకట్టే చలితో రాష్ట్రం వణికిపోతోంది. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో అన్ని ప్రాంతాల్లో చలి వాతావరణం నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలు చలితో వణుకుతున్నాయి.


ఆదివారం( డిసెంబర్​ 17) రోజున తెలంగాణలో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 12.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 13.1 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 13.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కోపాల భూషణ్‌పల్లిలో 13.9 డిగ్రీలు. జిల్లా, పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో 13.9 డిగ్రీలు. 14.2 డిగ్రీలు, మెదక్ జిల్లా దామరంచలో కనిష్ట ఉష్ణోగ్రత 14.3 డిగ్రీలుగా  ఆదివారం ( డిసెంబర్​ 17)నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

ఇప్పటివరకు రాష్ట్రంలో రాత్రిపూట మాత్రమే చలిగాలులు నమోదవుతుండగా.. తొలిసారి ఆదివారం( డిసెంబర్​ 17) పగటిపూట సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మహబూబ్‌నగర్‌లో 27.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, 3 డిగ్రీలు తగ్గి 30.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న రెండు రోజుల  ( డిసెంబర్​ 19, 20) పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పొగమంచు కురుస్తోంది. ప్రధాన రహదారులపై పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి.

ఇక ఏపీ ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రెండురోజులపాటు  దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.  రాయలసీమలో  ( డిసెంబర్​ 19,20) పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖలోని ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. చలి భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇక చలి ఉత్తర భారతాన్ని భయపెడుతోంది.