పూరీతో పాటు బల్లి సర్వ్ చేసిన ఫుడ్ కోర్ట్ 

పూరీతో పాటు బల్లి సర్వ్ చేసిన ఫుడ్ కోర్ట్ 

న్యూఢిల్లీ : టిఫిన్ చేసేందుకు వచ్చిన కస్టమర్లకు ఓ ఫుడ్ కోర్టు సిబ్బంది షాకిచ్చారు. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తో పాటు బతికున్న బల్లిని సర్వ్ చేశారు. ఒళ్లు గగుర్పాటు కలిగించే ఈ ఘటన చంఢీఘడ్లో జరిగింది. ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 

చంఢీఘడ్ కు చెందిన గుర్మీందర్ చీమా అనే వ్యక్తి మంగళవారం ఇలాంటే మాల్కు వెళ్లాడు. ఆకలి వేయడంతో మాల్ లోని సాగర్ రత్న పుడ్ కోర్టుకు వెళ్లారు. అక్కడ ఫేమస్ డిష్ అయిన చోలే బటూరే (పూరీ,శనగల కర్రీ) ఆర్డర్ చేశారు. కాసేపటికి పుడ్ కోర్టు సిబ్బంది ఆర్డర్ సర్వ్ చేశారు. సగం పూరీ తిన్న తర్వాత గుర్మీందర్ కు భయంకరమైన అనుభవం ఎదురైంది. తాను తింటున్న పూరీ ప్లేటులో బతికున్న బల్లి దర్శనమిచ్చింది. 

తాను ఆర్డర్ చేసిన ఫుడ్ ప్లేటులో ఓ బల్లి పిల్ల అచేతన స్థితిలో కనిపించిండటంతో గుర్మీందర్ విషయాన్ని పుడ్ కోర్టు సిబ్బంది దృష్టికి తెచ్చాడు. ఆ తర్వాత చంఢీఘడ్ పోలీసులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేయడంతో వారు ఆ శాంపిల్స్ను పరీక్షల కోసం పంపారు. గుర్మీందర్ చీమా ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. ఫుడ్ కోర్టు తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.