ఆ పంట పనికిరాదన్నరు.. పండించి చూయించిండు

ఆ పంట పనికిరాదన్నరు.. పండించి చూయించిండు

‘నవ్విన నాప చేనే  పండుతుంది’.. అవును ఇది అక్షరాల నిజం. పెద్దపల్లి జిల్లా పోతారంకి చెందిన రైతు వెంకట్రావ్​ ​ గురించి తెలుసుకుంటే మీరూ ఈ మాటే అంటారు. 

మెదక్​ / నిజాంపేట, వెలుగు: వెంకట్రావ్​ నాలుగేళ్ల కిందట నిజాంపేట చల్మెడలో 40 ఎకరాల భూమి కొన్నాడు. మార్కెట్​ని బట్టి పామాయిల్​ వచ్చే ఆయిల్​పామ్​ పంట వేయాలనుకున్నాడు. కానీ, సెంట్రల్​ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్​లో  తన భూమి  ఆయిల్​ పామ్ సాగుకి అనుకూలం కాదని తేలింది. అయినా సరే నేలతల్లిని నమ్ముకుని ధైర్యం చేశాడు వెంకట్రావ్​.  ఇరవై ఎకరాల్లో ఆయిల్​ పామ్​ సాగు  మొదలుపెట్టాడు. అది చూసి ఇరుగుపొరుగు  నవ్వారు. అయినా వెనకడుగేయలేదు.  పొలంలో 3.20 లక్షల లీటర్ల కెపాసిటీతో ఒక సంపు, 2.80 లక్షల లీటర్ల కెపాసిటీతో మరో సంపు పెట్టి  డ్రిప్​ సిస్టమ్​ ఏర్పాటు చేశాడు. రేయింబవళ్ళు కష్టం చేసి  మంచి దిగుబడి సాధించాడు.  వెంకట్రావ్​ సక్సెస్​ని చూసి తోటి రైతులు ఆశ్చర్యపోతున్నారు. రీసెర్చర్లు వెంకట్రావ్ పొలానికి ‘క్యూ’ కడుతు న్నారు. విచిత్రం ఏంటంటే ఈ మధ్య హార్టికల్చర్​ ఆఫీసర్లు మరోసారి  అక్కడి మట్టిని టెస్ట్ చేస్తే.. పామాయిల్​  బంగారంలా పండుతుందని తేలింది. వెంకట్రావ్​ని చూసి చుట్టుపక్కల రైతులు  కూడా ఆయిల్​పామ్​ సాగుకి ముందుకొస్తున్నారు. 
పామాయిలే బెటర్​ 
మా దగ్గరి చుట్టాల్లో ఒకరు పదెకరాల్లో ఆయిల్​పామ్​ సాగు చేస్తున్నారు. వాళ్లకి  మంచి లాభాలు వస్తుండటంతో  నేను కూడా 20 ఎకరాల్లో ఆయిల్​పామ్​ సాగు మొదలుపెట్టా.  మిగతా పంటలతో పోలిస్తే  పదిరూపాయలు ఎక్కువే మిగులు తున్నాయి. ఆయిల్​పామ్​ తోటలో షెడ్​ వేసి 8 ఆవులు, 120 గొర్రెలను పెంచుతున్నా.. వాటి ద్వారా వచ్చే ఆదాయంతోనే  కూలీ ఖర్చులు వెళ్లదీస్తున్నా.                           - వెంకట్రావ్​

: