3 చైనా కంపెనీలపై అమెరికా బ్యాన్

3 చైనా కంపెనీలపై అమెరికా బ్యాన్

వాషింగ్టన్: పాకిస్తాన్​కు బాలిస్టిక్​ మిసైల్​ తయారీకి పరికరాలు అందజేస్తున్న మూడు చైనా కంపెనీలపై అమెరికా నిషేధం విధించింది. అంతర్జాతీయ అణ్వస్త్రవ్యాప్తి నిరోధక, నిరాయుధీకరణ పాలసీ కింద ఈ ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం పేర్కొంది.

చైనాకు చెందిన మూడు కంపెనీలు జనరల్‌ టెక్నాలజీ లిమిటెడ్‌, బీజింగ్ లువో లువో టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌, చాంగ్‌ జౌ యుటెక్‌ కంపోజిట్‌ కంపెనీ లిమిటెడ్‌లు పాక్‌ బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమానికి సంబంధించిన వస్తువులను సరఫరా చేశాయని, అందుకే వాటిపై బ్యాన్​విధించినట్లు  విదేశాంగశాఖ తెలిపింది.