పెరుగుతున్న కరోనా కేసులు.. రూల్స్ బ్రేక్ చేస్తే దాదాపు రూ. పది లక్షల వరకు ఫైన్

పెరుగుతున్న కరోనా కేసులు..  రూల్స్ బ్రేక్ చేస్తే దాదాపు రూ. పది లక్షల వరకు ఫైన్

కరోనా ప్రపంచాన్ని మొత్తం వణికిస్తోంది. ఏ దేశంలో చూసినా కరోనా మరణాలు ఆగడంలేదు. తాజాగా యూరప్‌లో కరోనావైరస్ రెండో వేవ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. దాంతో అక్కడ కరోనా రూల్స్‌ను పూర్తిగా మార్చివేశారు. కరోనావైరస్ బారినపడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండటానికి నిరాకరిస్తే వారికి సుమారు రూ. 10 లక్షల వరకు ఫైన్ విధిస్తామని ప్రధాని బోరిస్ జాన్సన్ శనివారం వెల్లడించారు. ‘ఈ వారంలో బ్రిటన్‌లో కరోనా కేసులు మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే కొత్త నిబంధనలు అమలులోకి తీసుకొచ్చాం. అవి సెప్టెంబర్ 28 నుంచి అమలులోకి వస్తాయి. వైరస్ పాజిటివ్ వచ్చిన వాళ్లు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలి. అలా ఉండని వారిని నేషనల్ హెల్త్ సర్వీస్ ట్రేసింగ్ ప్రోగ్రాం ద్వారా కనిపెట్టి ఐసోలేట్ చేస్తారు. అదేవిధంగా వారికి 11 వేల యూరోల ఫైన్ విధిస్తారు. ఎవరికి వారు కరోనా నియమాలను పాటించడమే కరోనా వైరస్‌తో పోరాడడానికి ఉత్తమ మార్గం’ అని జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం వైరస్ లక్షణాలు ఉన్నవాళ్లు మరియు పాజిటివ్ వచ్చినవాళ్లు సెల్ఫ్ ఐసోలేషన్‌ను 10 రోజులకు తగ్గించాలని కోరుతున్నారు. అయితే ఒంటరిగా ఉండేవాళ్లు 10 రోజులు ఉండోచ్చు కానీ.. ఇతరులతో కలిసి ఉండేవాళ్లు మాత్రం ఖచ్చితంగా 14 రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన తెలిపారు. ఐసోలేషన్‌లో ఉండటం వల్ల వర్క్ ఫ్రం హోం చేయలేని వాళ్లకు ప్రభుత్వం తరపున 500 పౌండ్ల ఆర్థికసాయాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. కరోనా వల్ల ఇప్పటికే దేశంలో 42 వేల మంది మరణించారని ఆయన అన్నారు. మళ్లీ బ్రిటన్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. అయినప్పటికీ మరోసారి లాక్‌డౌన్ విధించే ఉద్దేశం లేదని ఆయన అన్నారు.

కొత్తగా రూపొందించిన జరిమానాలు 1,000 పౌండ్ల నుండి ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ ప్రయాణాల తరువాత ఐసోలేషన్‌లో ఉండకపోయినా.. లేదా కరోనా రూల్స్‌ను మళ్లీమళ్లీ బ్రేక్ చేసినా 10 వేల పౌండ్ల వరకు జరిమానా విధించబడుతుందని అధికారులు తెలిపారు.

For More News..

దర్శకుడు నన్ను రేప్ చేయాలని చూశాడు.. కాపాడాలంటూ ప్రధానికి ట్వీట్ చేసిన హీరోయిన్

దేశంలో 54 లక్షలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 2,137 కరోనా పాజిటివ్ కేసులు

చనిపోవాలని డిసైడ్​ అయ్యా.. సోషల్​ మీడియాలో నిరుద్యోగి సెల్ఫీ వీడియో