చైనాలో వరదల ధాటికి 15 మంది మృతి

చైనాలో వరదల ధాటికి 15 మంది మృతి

బీజింగ్: చైనాలో బుధవారం కుండపోత వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. వరదల ధాటికి 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గల్లంతయ్యారు. చైనా నైరుతి ప్రాంతంలోని కొండప్రాంతాలపై  వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. చాంగ్కింగ్ లో  వరద ఉద్ధృతికి నలుగురు కొట్టుకుపోయారన్నారు. కొండలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో 31 మిలియన్ల జనాభా​ ఉన్నారని, వీరికి వరద ముప్పు పొంచి ఉందని స్థానిక ప్రభుత్వ వెబ్​సైట్​పేర్కొంది. చైనా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తగా చాంగ్కింగ్ లో తీవ్ర ప్రభావం చూపాయి. వేలాదిమంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. 

ఒక్క సిచువాన్​ ప్రావిన్స్​లోనే 85 వేలమంది వరదల కారణంగా తమ నివాసాలను విడిచివెళ్లిపోయారని అధికారిక జిన్హూవా న్యూస్​ ఎజెన్సీ వెల్లడించింది. రెస్క్యూ టీమ్​లు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయని, కొండ చరియలు విరిగిపడి రోడ్లు మూసుకుపోవడంతో కార్మికులు తొలగిస్తున్నారని ప్రభుత్వ వెబ్​సైట్ తెలిపింది. ఈ మేరకు 
ఫొటోలను వెబ్​సైట్​లో పోస్టు చేశారు.