IAS, IPS అధికారులపై 18వేల కోర్టు ధిక్కరణ కేసులు

IAS, IPS అధికారులపై 18వేల కోర్టు ధిక్కరణ కేసులు
  • చట్టాలు సాధారణ పౌరులకేనా ? 
  • ఏఐసీసీ అధికార ప్రతినిధి  దాసోజు శ్రవణ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చట్టాలు సాధారణ పౌరులకే వర్తిస్తాయా ? అని ప్రశ్నించారు  ఏఐసీసీ అధికార ప్రతినిధి  దాసోజు శ్రవణ్. చట్టం,  రాజ్యాంగ  సంరక్షకులుగా  చెప్పుకునే ఐఏఎస్ (IAS), ఐపీఎస్( IPS) అధికారులే నియమాలు  పాటించకపోవడం ఆశ్చర్యానికి  గురి చేస్తోందన్నారు. చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ తోసహా ఇతర  అధికారులు కూడా 18వేలకు  పైగా కోర్టు ధిక్కరణ కేసులు ( కంటెంప్ట్  ఆఫ్  కోర్టు కేసులు)  ఎదుర్కొంటున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు.అధికారులు  చట్ట వ్యతిరేకమైన  కార్యక్రమాలకు  పాల్పడుతున్నారని... దీన్ని బట్టి  అర్థం అవుతుందన్నారు.  రాజ్యాంగ సంరక్షకులుగా  పిలువబడే  ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు  చట్టాలు వర్తించవా ?  అని ప్రశ్నించారు దాసోజు శ్రవణ్.

 

 

 

 

 

 

ఇవి కూడా చదవండి

ముగ్గురు వ్యాపారవేత్తలకు రాజ్యసభ సీట్లు

దశలవారీగా దళితబంధు అమలు చేస్తాం

వివాదంగా మారిన గుడిసెల తొలగింపు