
ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. మార్చి 10న అడిస్ అబాబా నుంచి ముంబైకి వచ్చిన ముగ్గురు విదేశీయుల నుంచి రూ.1.40 కోట్ల విలువైన 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షూ, లోదుస్తుల్లో బంగారం దాచినట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.