అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలు సీజ్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలు సీజ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలను నిన్నరాత్రి(2024 మార్చి 17) కాటారం పోలీసులు పట్టుకున్నారు. మల్హర్ మండలంలోని ఇసుక క్వారీల నుంచి అక్రమంగా ఇసుకను లోడ్ చేసుకొని లారీలలో వరంగల్ వైపు తీసుకెళ్తుండగా కాటారం సీఐ నాగర్జున అదుపులోకి తీసుకున్నారు. కొయ్యుర్ సమీపంలో రెండు, బస్వాపూర్ దగ్గర మరో రెండు ఇసుక లారీలను ఆపి తనిఖీ చేయగా.. ఇసుక రవాణకు ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని కాటారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.  4 లారీలను సీజ్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఎక్కడి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని పోలీసులు  డ్రైవర్లను అడగగా సరైనా సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాటారంలో పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు పట్టుకున్న విషయం అక్రమార్కులకు తెలియడంతో మల్హర్ మండలం తాడిచర్ల, మల్లారం ప్రధాన రహదారిపై ఇసుకను డంప్ చేసి పరారయ్యారు.