
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 22339 మందికి పరీక్షలు చేయగా... 528 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ వల్ల చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇక 1864 మంది తాజాగా కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాల్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,29,16,247 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 23 లక్షల 15వేల 30 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటివరకు 14వేల 707 మంది చనిపోయారు. ఇక ఇప్పటివరకు 22లక్షల 90వేల,853 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో 9470 మంది కోవిడ్‌తో చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 17/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 17, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,15,030 పాజిటివ్ కేసు లకు గాను
*22,90,853 మంది డిశ్చార్జ్ కాగా
*14,707 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,470#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/sBhzT3e8Wl
ఇవి కూడా చదవండి: