రోడ్డుపై జారి పడిన మహిళ.. హోటల్పై కేసు

రోడ్డుపై జారి పడిన మహిళ.. హోటల్పై కేసు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఉన్న అంతేరా కిచెన్ అండ్ బార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రెస్టారెంట్ కు సంబంధించిన కిచెన్ వ్యర్థాలను డ్రైనేజీ లైన్ లోకి వదలడంతో మ్యాన్ హాల్ పొంగి..రోడ్డుపై వెళ్తున్న వారిపై పడింది. ఈ క్రమంలోనే వాహనాలపై వెళ్తున్న పలువురిపై బురద పడింది. కొంతమంది బైక్ స్కిడ్ అయ్యి.. కింద పడిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. 

హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే తాను ప్రమాదానికి గురయ్యానని జూబ్లీహిల్స్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు కమలాపురి కాలనీకి చెందిన దీపిక. బాధితురాలి ఫిర్యాదుతో అంతేరా కిచెన్ అండ్ బార్ యాజమాన్యంపై ఐపీసీ 336 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రజల ప్రాణాలకు, భద్రతకు హాని కలిగిస్తోందంటూ హోటల్‌ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.

ఇటు అంతేరా హోటల్ నిర్వాహకులకు జలమండలి అధికారులు నోటీసులు జారీ చేశారు. నేరుగా కిచెన్ వ్యర్థాలను డ్రైనేజీ లైన్ లోకి వదులుతున్నట్లు గుర్తించారు అధికారులు.  మూడు రోజుల్లోగా దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో స్పష్టం చేశారు.