కీమోకు జుట్టు పోకుండా కూలింగ్ క్యాప్

కీమోకు జుట్టు పోకుండా కూలింగ్ క్యాప్

సమస్యలోనే సమాధానం దొరుకుతుంది అంటారు చాలామంది. అలా తనకు ఎదురైన సమస్యకు సమాధానం వెతికింది. తను పడ్డ కష్టం ఇంకొకరు పడొద్దు అనుకుంది. అందుకు కావాల్సిన జవాబు వెతుకుతూ అందరికి ఉపయోగపడే గ్యాడ్జెట్ తయారుచేసింది అర్జెంటీనాకు చెందిన 41 ఏండ్ల పొలా ఎస్ట్రాడా.

 ALSO READ :Health Tip : ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోవచ్చు..

పౌలా 2009లో రొమ్ము క్యాన్సర్ బారినపడింది. కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంది. తరువాత క్యాన్సర్నుంచి కోలుకున్నా, దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తో ఇష్టంగా పెంచుకున్న జుట్టు కోల్పోయింది. 'నాలాగే జుట్టును అపురూ పంగా పెంచుకునేవాళ్లు చాలామందే ఉంటారు. వాళ్లకోసం ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాల”నుకుంది. అప్పుడే 'కూలింగ్ క్యాప్' ఆలోచన వచ్చింది పొలాకు, దాంతో ఐస్ ప్యాం క్లను ఒక క్యాప్ పెట్టి హెల్మెట్ లాంటిదాన్ని తయారుచేసింది. అది కీమోథెరపీ టైంలో తలకు పెట్టుకోవాలి. అందులో ఉన్న ఐస్ తల మీద ఉన్న రక్తనాళాలను అణిచి, కీమోథెరపీలో వాడిన మెడిసిన్ జుట్టు కుదుళ్లకు చేరకుండా చేస్తుంది. అలా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు తీసుకున్న తర్వాత అర్జెంటీనాతో పాటు చిలీ, మెక్సికో, స్పెయి స్లోని అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ లో ఈ క్యాప్ అం దుబాటులోకి వచ్చింది. ఈ హెల్మెట్ ను కీమోథెరపీ నుంచి పెట్టుకోవడం మొదలుపెట్టాలి. ప్రతీ అర గంటకోసారి మార్చాలి. అలాగే క్యాప్ టెంపరేచర్ నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర ఉండాలి. ఇది తయారుచేసిన ఎస్టాడా ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్లకు అడ్వైజర్గా పనిచేస్తోంది. మోటివేషనల్ స్పీకర్గా క్యాన్సర్ పేషెంట్లకు ధైర్యాన్ని ఇస్తోంది.